BigTV English

Sriram Krishnan: ట్రంప్ టీమ్‌లో ఇండో అమెరికన్, ఎవరు శ్రీరామ్ కృష్ణన్?

Sriram Krishnan: ట్రంప్ టీమ్‌లో ఇండో అమెరికన్, ఎవరు శ్రీరామ్ కృష్ణన్?

Sriram Krishnan: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టక ముందే డోనాల్డ్‌ట్రంప్ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ట్రెండ్‌.. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త టీమ్‌ని ఎంపిక చేసే పనిలో‌ పడ్డారు. లేటెస్ట్‌గా శ్రీరామ్ కృష్ణన్‌కు కాలం కలిసొచ్చింది. ఆయన్ని తన టీమ్‌లోకి తీసుకున్నారు కాబోయే అధ్యక్షుడు. ఇంతకీ శ్రీరామ్ ఎవరు? ఏంటి అన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.


అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టేనాటికి ట్రంప్ తన టీమ్‌ని రెడీ చేస్తున్నారు. ఆయన టీమ్‌లో ఇండో అమెరికన్లకు చోటు దక్కింది. ఈ జాబితాలో మరొకరు చేరిపోయారు. ఆయన ఎవరోకాదు శ్రీరామ్‌ కృష్ణన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)పై పాలసీ అడ్వైజర్‌గా ఆయన్ని నియమించారు ట్రంప్.

స్వతహాగా శ్రీరామ్ కృష్ణన్ వెంచర్ కేపిటలిస్టు కూడా. వైట్‌హౌస్‌లో ఏఐ జార్ డేవిడ్‌తో కలిసి పని చేయనున్నారు. దీనిపై శ్రీరామ్ రియాక్ట్ అయ్యారు. కాబోయే అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై పుట్టి పెరిగిన శ్రీరామ్‌కృష్ణన్, అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.


ఆ తర్వాత 2007లో మైక్రోసాఫ్ట్‌లో ప్రొగ్రామ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యునిగా కొనసాగారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కేవలం మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఉండిపోకుండా ఫేస్ బుక్, యాహూ, ఎక్స్ వంటి కంపెనీల్లో పని చేసిన అనుభవం సంపాదించాడు.

ALSO READ: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 10 మంది మృతి

రెండేళ్ల కిందట ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సమయంలో అందులో పని చేస్తున్నారు. ఆ తర్వాత ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా మస్క్ ఆయనను నియమించారు. శ్రీరామ్ కృష్ణన్‌కు ఏళ్ల తరబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో అపార అనుభవం ఉంది.

పెట్టుబడిదారుడైన శ్రీరామ్ కృష్ణన్, భారతీయ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్‌ సలహాదారుగా ఉన్నారు. భార్య ఆర్తి రామమూర్తి‌తో కలిసి ఓ షోకు సహ హోస్ట్‌గా వ్యవహరించారు. అంతేకాదు వివేక్ రామస్వామికి మంచి సన్నిహితుడు కూడా. శ్రీరామ్ కృష్ణన్(Sriram Krishnan) అనుభవానికి సరైన గుర్తింపు లభించింది.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×