BigTV English

The Kerala Story: ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

The Kerala Story: ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

The Kerala Story: ఎన్నో వివాదాల నడుమ థియేటర్లలో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. గతేడాది మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం రూ.35 కేట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని విధంగా రూ.244.8 కోట్ల మేర వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది.


సాధారణంగా థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఒకటి, రెండు నెలల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇంకా ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ చిత్రాన్ని చూసేందుకు ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 లేదా 17న ఓటీటీలో సందడి చేయనున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×