The Raja Saab: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పాడుకోవడం మొదలుపెట్టేశారు. కల్కి ఫీవర్ నుంచి ఇంకా బయటపడకముందే.. రాజాసాబ్ తో దర్శనమిచ్చాడు డార్లింగ్. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి మారుతీ ప్రభాస్ ను ఇంతకుముందు మీరెప్పుడు చూడనివిధంగా చూపిస్తాను అని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ప్రభాస్ లుక్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రాజాసాబ్ దిగేశాడు. రాయల్ బైక్ పై రాయల్ లుక్ లో డార్లింగ్ కనిపించాడు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు మారుతీ.
ఇప్పటివరకు ప్రభాస్ సినిమాల్లో డార్లింగ్ సినిమాలో కనిపించనంత యాక్టివ్ గా ప్రభాస్ మరే సినిమాలో కనిపించలేదు. అంతేనా అంత కామెడీ కూడా ఇంకే సినిమాలో చేయలేదు. ఇక రాజాసాబ్ లో డార్లింగ్ ప్రభాస్ కనిపించనున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తుంటేనే తెలుస్తోంది. మెరూన్ సూట్ లో.. బైక్ పై అలా వచ్చి.. చేతిలో బొకే పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే.. అమ్మాయిల గుండెలు అలా పైకి వెళ్లిపోతున్నాయి. అంత అందంగా ఉన్నాడు ప్రభాస్.
ఆదిపురుష్ నుంచి కల్కి వరకు ప్రభాస్ హేటర్స్.. అతని లుక్ గురించి ఎన్ని విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ లుక్ చూసాక.. అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్ గా ఏది.. ప్రభాస్ లుక్ గురించి ఇప్పుడు మాట్లాడండిరా చూద్దాం.. అంటూ సవాల్ విసురుతున్నారు. మరి రాజాగారితో మాములుగా ఉండదు మరి. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న రిలీజ్ కానున్నట్లు కూడా తెలిపారు. వచ్చే ఏడాది సమ్మర్ కు రాజాసాబ్ ఏ రేంజ్ లో నవ్విస్తాడో.. ఏ రేంజ్ లో భయపెడతాడో చూడాలి.