OTT Movie : కొరియన్ సినిమాలంటే క్రేజీగా ఇష్టపడే వారి సంఖ్య చెప్పలేనంతగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉంటూ కొరియన్ సినిమాలు, సిరీస్ లు చూస్తూ కాలక్షేపం చేయడమే కాకుండా, వాటికి బానిసలైపోయారు మనోళ్ళు కూడా. అలాంటి క్రేజీ కొరియన్ మూవీ లవర్స్ కోసమే ఈ అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్. అందులోనూ ప్రభాస్ కు విలన్ కావాలని ఆయన అభిమానులు గాఢంగా కోరుకునే పాపులర్ కొరియన్ యాక్టర్ డాన్ లీ ఇందులో నటించారు. ఈ మూవీ కథ ఏంటి? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను చూసేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ మూవీలో కథ 2008లో జరుగుతుంది. ది అవుట్‌లాస్ సంఘటనలు జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత. గెమ్‌చియోన్ పోలీస్ స్టేషన్ లోని మేజర్ క్రైమ్స్ యూనిట్ కు చెందిన బీస్ట్ కాప్ డిటెక్టివ్ మా సియోక్-డో (మా డాంగ్-సియోక్), అతని కెప్టెన్ జియోన్ ఇల్-మాన్ (చోయ్ గ్వి-హ్వా) వియత్నాంలోని హో చి మిన్ సిటీకి చెందిన ఒక నిందితుడు యూ జాంగ్-హూన్ ను పట్టుకోవడానికి వెళతారు. కానీ యూ జాంగ్-హూన్ స్వచ్ఛందంగా లొంగిపోవడం మా సియోక్-డోకు అనుమానం కలిగిస్తుంది. ఎందుకంటే వియత్నాంకు కొరియాతో ఎక్స్‌ట్రాడిషన్ ఒప్పందం లేదు.
వియత్నాంలో మా సియోక్-డో కొరియన్ పర్యాటకులపై జరుగుతున్న దారుణమైన హత్యలు, కిడ్నాపింగ్‌ల గురించి తెలుసుకుంటాడు, ఇవి కాంగ్ హే-సాంగ్ (సన్ సుక్-కు) అనే క్రూరమైన సీరియల్ కిల్లర్ చేసినవి. కాంగ్ ఒక మాచెట్‌తో కలిసి, కొరియన్ వ్యాపారవేత్తలను కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేస్తూ, వారిని హత్య చేస్తాడు. ఈ కేసు 2008-2012 మధ్య ఫిలిప్పీన్స్‌లో జరిగిన నిజ జీవిత సీరియల్ కిడ్నాపింగ్, హత్య కేసు (యూన్ చియోల్-వాన్ కేసు) నుండి స్ఫూర్తి పొందింది. దానికి మరిన్ని కల్పిత అంశాలను యాడ్ చేసి సినిమాను తెరకెక్కించారు.
మా సియోక్-డో, అతని టీమ్ (జాంగ్ ఇసు, ఓ డాంగ్-గ్యున్) కాంగ్ ను పట్టుకోవడానికి వియత్నాంలో ఒక యాక్షన్-ప్యాక్డ్ మిషన్ ను ప్రారంభిస్తారు. కథ కొరియాకు తిరిగి వచ్చిన తర్వాత, కాంగ్ తన బాస్ ను టార్గెట్ చేయడంతో కీలక మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో మా సియోక్-డో ఒక కామెడీ అండ్ స్ట్రాంగ్ పోలీసు అధికారిగా, తన భారీ పిడికిలితో శత్రువులను సునాయాసంగా ఓడిస్తాడు. సినిమాలో జరిగే కార్ చేజ్‌లు, ఎలివేటర్ ఫైట్‌లు, సియోల్ వీధుల్లో జరిగే హింసాత్మక షోడౌన్‌లతో నిండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్‌లో మా సియోక్-డో, కాంగ్ మధ్య జరిగే భీకరమైన ఫైట్, కథను ఒక ప్రిడిక్టబుల్ కానీ థ్రిల్లింగ్ క్లైమాక్స్ కు తీసుకెళ్తుంది. మరి ఆ క్లైమాక్స్ ఏంటి ? చివరికి ఏమైంది? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కూతుర్ని వెంటాడే తల్లి ఆత్మ … సచ్చినా సాధించడం అంటే ఇదే … చూసినోళ్ళకి చుక్కలే
ఏ ఓటీటీలో ఉందంటే ?
2022లో రిలీజ్ అయిన దక్షిణ కొరియా యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ది రౌండప్’ (The Roundup). లీ సాంగ్-యోంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మా డాంగ్-సియోక్ (డాన్ లీ), సన్ సుక్-కు, చోయ్ గ్వి-హ్వా, పార్క్ జి-హ్వాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ‘ది అవుట్‌లాస్’ (2017) చిత్రానికి సీక్వెల్. అలాగే ‘ది రౌండప్’ సిరీస్‌లో రెండో భాగం. 2022లో దక్షిణ కొరియాలో విడుదలైన ఈ మూవీ అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన కొరియన్ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 101.2 మిలియన్లు డాలర్లు వసూలు చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రస్తుతం Amazon Prime Video, Netflix ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది.