OTT Movie : 2024 లో రిలీజ్ అయిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు ఈ జనవరిలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే గత ఏడాది డ్రాగన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక అడ్వెంచర్ మూవీ, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ పేరు ‘డామ్సెల్‘ (Damsel). ఈ మూవీలో డ్రాగన్ ని శాంత పరచడానికి, ముగ్గురు యువరాణులను బలి ఇవ్వాల్సి వస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ ను పెళ్లి పేరుతో తనకి తెలియకుండా బలి ఇవ్వాలని కొంతమంది చూస్తారు. డ్రాగన్ చుట్టూ తిరిగే ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో మార్చి 8, 2024 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. డామ్సెల్ (Damsel) మూవీకి జువాన్ కార్లోస్ ఫ్రెస్నాడిల్లో దర్శకత్వం వహించారు. మిల్లీ బాబీ బ్రౌన్ ఎలోడీ పాత్రలో నటించారు, విన్‌స్టోన్, నిక్ రాబిన్సన్, షోహ్రే అగ్దాష్లూ, ఏంజెలా బాసెట్, రాబిన్ రైట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ హాలీవుడ్ అడ్వెంచర్ ‘డామ్సెల్’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
స్టోరీ లోకి వెళితే
బెఫర్డ్ ఒక రాజ్యానికి మంచి రాజుగా ఉంటాడు. ఇతనికి ఇద్దరు అందమైన కూతుర్లు ఎలోడీ, ఫ్లోరీ కూడా ఉంటారు. అయితే ఈ రాజ్యం చాలా కరువులో ఉంటుంది. బెఫర్డ్ పక్కరాజ్యం నుంచి ఎలోడీకి, హెన్రీ అనే రాజుతో పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాడు. ఎలోడీ, హెన్రీ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. హెన్రీ మాటలు ఎలోడీకి నచ్చడంతో పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు ఆమెను ఒక కొండ ప్రాంతంకి తీసుకువెళ్తారు. విషయం ఏమంటే హెన్రీ రాజ్యంలో, డ్రాగన్ పిల్లలని ఆ రాజ వంశస్థులు చంపుతారు. ఆ డ్రాగన్ ముగ్గురు రా జవంశస్తులని డ్రాగన్ కి బలి ఇచ్చే విధంగా ఒప్పందం జరుగుతుంది. ఈ క్రమంలోనే హెన్రీ ఈ యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. డ్రాగన్ కి బలి ఇవ్వడానికి ఆ కొండపైకి తీసుకువెళ్తాడు. ఆ కొండపై నుంచి ఎలోడీని, డ్రాగన్ ఉండే ప్లేస్ లో తోసేస్తాడు హెన్రీ. ఈ విషయాలు ఏమీ తెలియని ఆమె లోయలో పడిపోతుంది.
అయితే కొన్ని తేలికపాటి దెబ్బలతో, ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది. డ్రాగన్ ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె డ్రాగన్ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఎలోడీ చెల్లెల్ని కూడా ఆ డ్రాగన్ కి బలి ఇవ్వాలని చూస్తారు. చివరికి ఎలోడీ ఆ డ్రాగన్ నుంచి తప్పించుకుంటుందా? తన చెల్లెలు కూడా డ్రాగన్ కి బలవుతుందా? వీళ్ళందరికీ డ్రాగన్ తో ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డామ్సెల్’ (Damsel) అనే ఈ అడ్వెంచర్ మూవీని మిస్ కాకుండా చూడండి.