BigTV English

Devara Sequel: ‘దేవర -2’ షూటింగ్ షురూ.. దానిపైనే కొరటాల ఫోకస్..!

Devara Sequel: ‘దేవర -2’ షూటింగ్ షురూ.. దానిపైనే కొరటాల ఫోకస్..!

Devara Sequel: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీ మొదటి రోజు నుంచే మంచి హిట్ టాక్ ని అందుకుంది. త్రిబుల్ ఆర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయినట్టు తెలుస్తుంది. ఒకవైపు మంచి టాక్ తో దూసుకుపోతూ మరోవైపు బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది అదేవిధంగా ఓటీడీలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడం విశేషం. అయితే ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తీసిన సంగతి తెలిసిందే.. దేవర పార్ట్ 2 షూటింగు మొదలుపెట్టినట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


దేవర పార్ట్ వన్ మంచి సక్సెస్ ను అందుకోవడంతో పార్ట్ 2 ను ఇంకాస్త కొత్తగా తెరకెక్కించాలని డైరెక్టర్ కొరటాల శివ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు తమ టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కథ, స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దేవర పార్ట్ 2 మూవీని ఈ ఏడాది అక్టోబర్ మొదటివారం నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని కొరటాల శివ భావిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేస్తే పనిలో ఉన్న డైరెక్టర్ త్వరలోనే సినిమా షూటింగ్ అప్డేట్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది..

ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి అద్భుతమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవర సీక్వెల్ కోసం భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ యాక్షన్ మూవీ గా వచ్చిన ఈ సినిమా పార్ట్ 2


మరింత ఆకర్షణయంగా ఉండాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక సీక్వెల్ మూవీ ని అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఈసారి పక్కగా ప్లానింగ్ తో సినిమాని తెరకెక్కించాలని టీం భావిస్తుంది. ఎన్టీఆర్ కూడా కథలో కొన్ని మార్పులు చెబుతున్నట్లు తెలుస్తుంది. కథలో ఎమోషన్, యాక్షన్, డ్రామా అన్ని అంశాలను సమపాళ్లలో సమాహరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.  బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు  పోటీగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×