BigTV English

OTT Movie : ఆ పని చేస్తూ భర్తకి నరకం చూపించే భార్య … ఐశ్వర్య రాజేష్ కిరాక్ మూవీ

OTT Movie : ఆ పని చేస్తూ భర్తకి నరకం చూపించే భార్య … ఐశ్వర్య రాజేష్ కిరాక్ మూవీ

OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంటర్టైన్ అవుతారు. రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్, జీవి ప్రకాష్ కుమార్ నటించిన, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్ కి నిద్రలో గురక పెట్టే సమస్య ఉంటుంది. హీరో ఆ సమస్యతో పడే ఇబ్బందుల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లెక్స్ (Netflix) లో

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘డియర్‘ (Dear). 2024లో విడుదలైన ఈ సినిమాకు ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్వీరాజ్‌ ఈ సినిమాను నిర్మించారు. జివి ప్రకాశ్‌కుమార్‌, ఐశ్వర్య రాజేశ్, కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న 2024లో విడుదల చేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లెక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే…

అర్జున్ ఒక న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా ఉంటాడు. అయితే ఇతనికి ఒక పేరు ఉన్న ఛానల్లో రిపోర్టర్ గా చేయాలని డ్రీమ్ ఉంటుంది. ఇంతలోనే అర్జున్ తల్లి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఈ క్రమంలో మ్యాట్రిమోనీ నుంచి దీపిక ప్రొఫైల్ చూసి పెళ్లిచూపులకి తీసుకువెళ్తుంది. దీపికను చూసిన అర్జున్ ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. అయితే దీపికకి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. దీపిక తల్లి ఈ విషయం పెళ్లి తర్వాత చెప్పమంటుంది. వీళ్ళిద్దరి పెళ్లి జరిగిన తర్వాత అర్జున్ కి అసలు విషయం తెలుస్తుంది. అయితే దీపికకి ట్రీట్మెంట్ ద్వారా నయం కాదని కూడా తెలుసుకుంటాడు. ఒకరోజు అతడు అనుకున్న జాబ్ వస్తుంది. మినిస్టర్ ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా వస్తుంది. భార్య గురక వల్ల నిద్ర లేకపోవడంతో, ఇంటర్వ్యూ చేయాల్సిన వ్యక్తి నిద్రలోకి జారుకుంటాడు. ఈ ఘటనతో అతని ఉద్యోగం కూడా పోతుంది.

భార్య గురకతో విసిగిపోయిన అర్జున్ చివరికి విడాకులు తీసుకోవాలనుకుంటాడు. జడ్జ్ వీళ్ళ సమస్య విని అర్థం చేసుకోవడాని కొంత సమయం ఇస్తుంది. ఇంతలో చిన్నప్పుడు వదిలి వెళ్ళిపోయిన అర్జున్ తండ్రి తిరిగి వస్తాడు. అతడి రాకని మొదట నిరాకరించినా, క్షమించమని తండ్రి కోరడంతో మనసు మార్చుకుంటాడు అర్జున్. చివరికి అర్జున్, దీపికకి విడాకులు ఇస్తాడా? దీపిక గురకకు సొల్యూషన్ దొరుకుతుందా? వీళ్ళిద్దరూ మంచి లైఫ్ ని స్టార్ట్ చేస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లెక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డియర్’ (Dear) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×