BigTV English

OTT movie: ఆ ఊర్లో ఆడవాళ్లు డాన్స్ చేస్తే అంతే సంగతులు… ఇలాంటి మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT movie: ఆ ఊర్లో ఆడవాళ్లు డాన్స్ చేస్తే అంతే సంగతులు… ఇలాంటి మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT Movie : కొన్ని సినిమాలు చాలా గొప్పగా ఉంటాయి. వీటిలో ప్రతి సన్నివేశం భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇటువంటి సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలతో ఒక పల్లెటూరులో స్త్రీలను అణచివేస్తూ ఉంటారు. అయితే ఆ స్త్రీలు చైతన్యం తెచ్చే విధానం ఈ మూవీలో చక్కగా చూపించారు. ఇది ఒక అద్భుతమైన సినిమాగా చెప్పుకోవచ్చు. జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


షేమారూమ్ (ShemarooMe) లో

ఈ గుజరాతీ సినిమా పేరు ‘హెల్లారో‘ (Hellaro).  2019 లో వచ్చిన ఈ మూవీకి అభిషేక్ షా దర్శకత్వం వహించాడు. ఆశిష్ పటేల్, నీరవ్ పటేల్,  జయేష్ మోరే, శ్రద్ధా దంగర్, బృందా త్రివేది నాయక్, షచీ జోషి, నీలం పంచల్, తేజల్ పంచసార, కౌసంబి భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో, ఉత్తమ చలన చిత్రంగా హెల్లారో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ఇండియన్ పనోరమాలో ప్రారంభ చిత్రంగా అధికారికంగా ఎంపిక చేయబడింది. ఈ మూవీ 2019 నవంబర్ 8న థియేటర్లలో విడుదలై సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ షేమారూమ్ (ShemarooMe) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

గుజరాత్ లోని ఒక మారుమూల గ్రామంలో ఒక ఫెస్టివల్ వస్తుంది. అందులో దుర్గ మాత దగ్గర మగవాళ్ళు మాత్రమే డాన్స్ వేస్తారు. ఆడవాళ్లు ఇంటికే పరిమితమవుతారు. ఆడవాళ్లు డాన్స్ వేస్తే కీడు జరుగుతుందని ఆ ఊరు పెద్దలు నమ్ముతారు. అలా ఆరోజు మగవాళ్లు డాన్స్ వేసి ఫెస్టివల్ ని జరుపుకుంటారు. ఆ ఊరికి ఏడో తరగతి వరకు చదువుకున్న ఒక అమ్మాయి కోడలిగా వస్తుంది. భర్త ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన హీరోయిన్ కు అతడు ఈ ఊరిలో ఎలా ఉండాలో చెప్తాడు. ఆ తర్వాత అతడు ఆర్మీకి వెళ్లిపోతాడు. ఆ గ్రామంలో నీటి కోసం చాలా దూరం నడవాల్సి వస్తుంది. అమ్మాయిలు మాత్రమే నీళ్ల కోసం వెళ్తూ వస్తారు. అబ్బాయిలు మాత్రం ఇంటి దగ్గరే ఉంటారు. పట్టణం నుంచి చదువుకున్న ఒక వ్యక్తి ఆ ఊరికి వస్తాడు. అతడు ఆవూరి మనిషి కావడంతో, భర్త పోయిన ఆడవాళ్లను కూడా నీళ్ల కోసం పంపించమంటాడు. అలా ఎప్పుడూ గడప దాటని మహిళల నీళ్ల కోసం బయటికి వెళ్తుంది. అది ఆమెకు చాలా ఆనందాన్నిస్తుంది.

ఇలా వీళ్లు నీటి కోసం వెళుతుండగా, ఆ దారిలో ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉంటాడు. అతనికి హీరోయిన్ తన బిందెలో నుంచి నీళ్లు పోసి దాహం తీరుస్తుంది. మొదట పక్కన ఉన్న ఆడవాళ్లు అలా చేయకూడదని ఆమెను ఎంతగా వారించినా, ఆమె వినిపించుకోకుండా అతని దాహం తీరుస్తుంది. అతడు డప్పు వాయించే వ్యక్తి కావడంతో, ఒకసారి డప్పు వాయించమంటారు. అయితే ఆడవాళ్లను చూస్తూ వాయించకుండా, అటు తిరిగి వాయిస్తాడు. ఆ గ్రామంలోని మహిళలు అతని డబ్బుకు డాన్స్ వేయడం మొదలు పెడతారు. ఎన్నో రోజులుగా ఇంట్లోనే బానిసత్వాన్ని చూసిన ఈ మహిళలకు, ఈ నాట్యం చాలా ఆనందాన్నిస్తుంది. అలా ప్రతిరోజు నీటి కోసం వస్తున్న ఈ మహిళలు, అతని డప్పుకు డాన్స్ వేస్తూ ఉంటారు. ఈ ఆడవాళ్ళకి తన స్టోరీ కూడా చెప్తాడు ఆ డప్పు కొట్టే వ్యక్తి. ఒకరోజు తన భార్య పిల్లలతో ఒక గ్రామానికి వెళ్తాడు. ఇతని డబ్బుకు ఆ ఊరిలో మగవాళ్లు అగ్గిమంట చుట్టూ డాన్స్ వేస్తారు. అయితే ఆ వ్యక్తి ఆ మంట ఆరిపోయేంతవరకు భోజనం చేయకూడదు. అలా ఆ మంట దగ్గర కూర్చున్న డప్పు కొట్టే వ్యక్తి కూతురు, డాన్స్ వేస్తానని అడుగుతుంది. చిన్నపిల్ల కదా డాన్స్ వేస్తే ఏమవుతుందిలే అని డప్పు వాయిస్తాడు. ఆ అగ్ని అపవిత్రం చేశారంటూ ఆ గ్రామస్తులు భార్య పిల్లలపై దాడి ఆ ప్రమాదంలో ఇతని భార్య పిల్లలు చనిపోతారు. అతని కధ విని అక్కడున్న మహిళలు చాలా బాధపడతారు.

ఒకరోజు ఒక మహిళ ఇంట్లో పెద్దలకు జ్వరం వస్తుంది. డాన్స్ వేయడం వల్లే వచ్చింది అనుకున్న ఆ మహిళ జరిగింది అంతా ఊర్లో వాళ్లకు చెబుతుంది. అప్పుడు ఆ డప్పు కొట్టే వ్యక్తిని దారుణంగా కొడతారు ఆ గ్రామస్తులు. అతన్ని దుర్గామాతకు బలివ్వాలనుకుంటారు. అయితే అతని ఆఖరి కోరిక కోరమంటారు. అందుకు అతను చివరిసారిగా డబ్బు వాయిస్తానని చెబుతాడు. అందుకు గ్రామస్తులు ఒప్పుకుంటారు. అతను డప్పు వాయిస్తుంటే ఆ ఊరిలోని మహిళలంతా డాన్స్ వేయడం మొదలుపెడతారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఎప్పుడు కురవని వర్షం, వీళ్ళు డాన్స్ వేసిన తర్వాత కురుస్తుంది. అప్పటినుంచి   గ్రామస్తులు ఆడవాళ్లు డాన్స్ వేస్తే ఏ కీడు జరగదని నమ్ముతారు. మంచి ఫీలింగ్ తో పాటు మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీని మీరు కూడా మిస్ కాకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×