The Tourist family : ది టూరిస్ట్ ఫ్యామిలీ.. చిన్న సినిమాగా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఎలా అయితే నాని(Nani ) హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా విడుదల అయిందో.. తమిళంలో కూడా స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ‘రెట్రో’ సినిమా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే అలాంటి స్టార్ హీరో సినిమా వస్తోందని తెలిసి కూడా చిన్న సినిమా అయినా సరే నమ్మకంతో విడుదల చేశారు ది ఫ్యామిలీ స్టోరీ(The Family story). ఆ నమ్మకమే వీరినిప్పుడు నిలబెట్టింది అని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య విడుదలైన సూర్య సినిమాకి నెగటివ్ టాక్ రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అటు ఈ సినిమాకి ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన మౌత్ టాక్ రావడంతో అందరి దృష్టి సినిమాపై పడింది. నిజానికి ఈ సినిమాలో సిమ్రాన్ (Simran) ఒక్కటే తెలుగు వారికి తెలిసిన వ్యక్తి. శశి (Sasi ) కూడా కొంతవరకు తన సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కాబట్టి వీరు కూడా పరిచయమే. కానీ సినిమా సూపర్ గా ఉంది అనే మాట కారణంగా ఈ సినిమా చూడడానికి స్వతహాగా అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయడానికి నిర్మాణ సంస్థలు కూడా క్యూ కడుతున్నాయి.
‘ది టూరిస్ట్ ఫ్యామిలీ’ తెలుగు హక్కుల కోసం నిర్మాణ సంస్థలు పోటీ..
అందులో భాగంగానే ‘ది టూరిస్ట్ ఫ్యామిలీ’ తెలుగు డబ్బింగ్ కోసం కొన్ని నిర్మాణ సంస్థలు భారీగా ట్రై చేస్తున్నాయి. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం ఊహించని రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు అని సమాచారం. అయినా ఏదో ఒక ప్రైస్ వద్ద తెలుగు డబ్బింగ్ డీల్ కుదిరే ఛాన్స్ ఉంది. కాబట్టి త్వరలోనే ఈ సినిమా కూడా తెలుగులోకి రావచ్చని తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీని కేవలం రూ.7 కోట్లతో మాత్రమే నిర్మించారు. మౌత్ టాక్ బాగుండడంతో ఇప్పటివరకు రూ. 17 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అటు తమిళ్ లో మాత్రమే రూ.12 కోట్లు వచ్చాయి. చిన్న సినిమా అయినా సరే భారీగా డిమాండ్ ఏర్పడింది. మరి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను ఏ నిర్మాణ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి.
ది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా స్టోరీ విషయానికి వస్తే..
ధర్మదాస్ (శశి), ఆయన భార్య సిమ్రాన్, ఇద్దరు కొడుకులతో కలిసి అక్రమంగా శ్రీలంక నుంచి భారతదేశానికి వలస వస్తారు. తన బావమరిది (యోగి బాబు)ప్రోత్సాహంతో చెన్నైలోని ఒక కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుంటాడు. ఈ కాలనీ అయితే చుట్టుపక్కల వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు కాబట్టి మీకు సేఫ్ అనే ఉద్దేశంతో యోగిబాబు వారిని అక్కడే ఉండమని, వారికి పని కూడా సెట్ చేసే పనిలో పడతాడు. చుట్టుపక్కల వారు పలకరించినా..మాట్లాడొద్దని తన చెల్లి కుటుంబానికి సూచిస్తాడు. అయితే అందుకు భిన్నంగా ధర్మదాస్ , అతని కుటుంబ సభ్యులు ఇతర కుటుంబాలతో బాగా సన్నిహితులైపోతారు. అనుకోకుండా ధర్మదాస్ ఫ్యామిలీ ఒక బాంబ్ బ్లాస్ట్ కు కారణమని పోలీసులు వారిని వెతికే పనిలో పడతారు. మరి ఈ కుటుంబం పోలీసులకు దొరికిందా..? నిజంగానే ఆ బాంబ్ బ్లాస్ట్ కి ఈ ఫ్యామిలీ కారణమైందా ..? చివరికి ఏం జరిగింది..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
also read:Sivaji Raja : బండ్ల గణేష్ ఓ తుత్తర క్యాండిడేట్… ఆ రోజు కర్రతో కొడితే పారిపోయాడు.!