BigTV English

Pakistan : పాక్‌తో బలూచిస్తాన్ యుద్ధం!.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..

Pakistan : పాక్‌తో బలూచిస్తాన్ యుద్ధం!.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..

Pakistan : పహల్గాం ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌తో ఇటు పీవోకే, అటు పాక్.. ఒకే దెబ్బకు రెండు షాక్‌ ట్రీట్‌మెంట్స్ ఇచ్చింది. 24 మిసైల్స్‌తో 9 ఉగ్రవాద స్థావరాలను స్మాష్ చేసింది. సుమారు 80 మంది టెర్రరిస్టులను లేపేసింది. డైరెక్ట్‌గా పాక్ గడ్డపై బాంబులేసి.. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో బలంగా చాటింది. మా జోలికొస్తే.. మీ ఇంటికొచ్చి చంపేస్తాం అనేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. పాక్‌పై భారత్ చేసిన అటాక్స్‌తో.. మనకంటే మరొకరు మరింత ఎక్కువ ఖుషీ అవుతున్నారు.  వాళ్లే పాక్‌ నుంచి స్వతంత్రం కోరుకుంటున్న బలూచిస్తాన్ వేర్పాటువాదులు.


బలూచిస్తాన్ గెరిల్లా ఆర్మీ దాడులు..

భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరగాలని అందరికంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నదీ, కోరుకుంటున్నదీ బలూచిస్తాన్ ప్రజలే. ఆ క్షణం కోసం చాలా ఏళ్లుగా వెయిటింగ్ వాళ్లు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA). ఈ పేరు చెబితేనే పాక్ కంగారు పడుతుంది. పాక్ పక్కలో బల్లెంలా మరింది. పాకిస్తాన్ నుంచి స్వతంత్ర్యం కోరుకుంటూ.. ప్రత్యేక దేశం కోసం ఏర్పాటువాద పోరాటం చేస్తోంది బలూచ్ ఆర్మీ. గెరిల్లా దాడులతో చుక్కలు చూపిస్తోంది. ఇటీవలే 2025 మార్చి 11న.. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి.. పాక్ సైనికులను బంధీలుగా చేసి.. 214 మందిని చంపేసింది. 2025, మార్చి 16న నోష్కిలో సైనిక కాన్వాయ్‌పై దాడి చేసి 90 మంది జవాన్లను బలిగొన్నారు. ఇలాంటి దాడులు BLA ఖాతాలో ఇంకా చాలానే ఉన్నాయి. లేటెస్ట్‌గా పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. పాక్ సైనికులపై మళ్లీ విరుచుకుపడుతున్నారు బలూచ్ గెరిల్లాలు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో వరుస బాంబు పేలుళ్లకు దిగారు. పాక్ ఆర్మీ వాహనంకు సమీపంలో బాంబు పేల్చి.. ఏడుగురు సైనికులను హతమార్చారు. మరోవైపు, శుక్రవారం బలూచీ యాక్జెహ్తి కమిటీ (BYC) భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. బలూచిస్తాన్ ప్రజలపై పాక్ క్రూరత్వం, దాడులు, జైల్లో పెట్టడం, ప్రజలను కిడ్నాప్ చేయడం తదితర దుర్మార్గాలకు వ్యతిరేకంగా గళం విప్పారు స్థానికులు.


వేర్పాటువాదానికి కారణం ఏంటంటే..

కశ్మీర్ ఉద్రిక్తతల సమయంలోనే బలూచిస్తాన్‌లో ఇలాంటి పరిణామాలు జరగడం కాకతాళీయం కాదంటున్నారు. ప్రత్యేక దేశం కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. పాకిస్తాన్‌కు ఉత్తరాన ఇండియా ఉంటే.. నైరుతిలో బలూచిస్తాన్ ఉంటుంది. గ్యాస్, బొగ్గు, రాగి వంటి సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికినీ.. అభివృద్ధిలో చాలా వెనుకబాటు తనం కనిపిస్తుంది. పేదరికం నుంచి బలూచిస్తాన్ వేర్పాటువాదం పుట్టుకొచ్చింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) సాయుధ పోరాటం చేస్తోంది. ఆత్మాహుతి బాంబు దాడులు, గెరిల్లా అటాక్‌లతో పాకిస్తాన్‌కు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతోంది. అయితే, పాక్ ప్రభుత్వం సైతం తన ఉక్కుపాదాలతో బలూచిస్తాన్‌ను ఆర్థికంగా, రాజకీయంగా, మానవ హక్కుల పరంగా అణిచేస్తోంది.

Also Read : పీవోకే స్వాధీనం సాధ్యమేనా? సవాళ్లేంటి?

అదును కోసం చూస్తున్న BLA

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కనుక పాక్‌తో యుద్ధానికి దిగితే.. అది బలూచిస్తాన్‌కు గోల్డెన్ ఛాన్సే అవుతుంది. పాకిస్తాన్‌పై BLA పెద్ద ఎత్తున దాడికి దిగొచ్చు. ఇప్పటికే ఆ దేశ నలుమూలల నుంచి కశ్మీర్ బోర్డర్ వైపు బలగాలను తరలిస్తోంది పాక్. ఇదే అదనుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) వంటి సమూహాలు రెచ్చిపోవచ్చు. అదే జరిగితే.. ఇటు ఇండియాతో, అటు బలూచీలతో ఒకేసారి రెండు వైపులా యుద్ధం చేయడం పాకిస్తాన్‌కు కత్తి మీద సామే.

బలూచిస్తాన్‌కు ఇండియా సపోర్ట్?

బలూచ్ తిరుగుబాటుదారులకు భారత్ మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. డబ్బు, ఆయుధాలు, నిఘా సహకారం అందిస్తోందని వాదిస్తోంది. పాక్ ఆరోపణను ఇండియా ఖండిస్తూ వస్తోంది. మరోవైపు, పాక్‌కు రెండు పొరుగు దేశాలైన ఇరాన్, అఫ్ఘనిస్తాన్‌లు సైతం బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటానికి మొదటినుంచీ మద్దతు ఇస్తున్నాయి. యుద్దమే వస్తే.. BLAకు ఆ రెండు దేశాలు సైనిక సాయం చేసే ఛాన్సెస్ ఉన్నాయి.

Also Read : కశ్మీర్ లేకపోతే భారత్ పరిస్థితి ఏంటి?

ఇండియా సై అంటే.. యుద్ధానికి సిద్ధమేనా?

అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాదానికి అంతర్జాతీయ మద్దతు లేదు. అమెరికా, బ్రిటన్‌, చైనా తదితర దేశాలు BLAను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. ఒక వేళ బీఎల్ఏ రెచ్చిపోతే.. వారిని అణిచేందుకు పాకిస్తాన్‌కు చైనా సాయం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పీవోకేలో చైనా చేపడుతున్న పెట్టుబడులు కారిడార్‌పై పలుమార్లు గెరిల్లా దాడులు జరిగాయి. ఆ కోపంతో చైనా.. పాక్‌కు అండగా నిలవొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా.. బలూచిస్తాన్ మాత్రం ప్రస్తుతం యుద్ధానికి సర్వ సన్నద్ధంగా ఉంది. పాకిస్తాన్‌పై ఇండియా జంగ్ సైరన్ మోగిస్తే.. మరోవైపు నుంచి పాక్‌కు చుక్కలు చూపించేలా బలూచీలు గెరిల్లా వ్యూహాలతో రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత బలూచిస్తాన్ వేర్పాటువాదులు సైతం యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే.. పాక్‌కు రెండు వైపుల నుంచి దబిడి దిబిడే.

Also Read : ఇండియా vs పాకిస్తాన్.. ఎవరి బలం ఎంత?

Also Read : ఆనాటి సర్జికల్ స్ట్రైక్స్.. కంప్లీట్ డీటైల్స్..

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×