BigTV English

Guntur Karam Movie : సంక్రాంతికి థియేటర్లన్నీ సందడి…. కానీ భారం అంతా ఆ ఒక్కడి పైనే…

Guntur Karam Movie : సంక్రాంతికి థియేటర్లన్నీ సందడి…. కానీ భారం అంతా ఆ ఒక్కడి పైనే…
Guntur Karam Movie

Guntur Karam Movie : రాబోయే సంక్రాంతికి సినిమా థియేటర్లు వరుస చిత్రాలతో కలకలలాడుతాయి. స్టార్ హీరోల సినిమాల తో కలిపి సుమారు 8 సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది కాక ఒక రెండు మూడు డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇన్ని సినిమాలకు ఒకేసారి థియేటర్ లో అడ్జస్ట్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పోయిన సంవత్సరం సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి.. రెండు స్టార్ హీరోల సినిమాలు వస్తేనే థియేటర్ లు అల్లాడిపోయాయి…డిస్ట్రిబ్యూటర్లు దిక్కుతోచక తికమక పడ్డారు. మరి ఈసారి ఏకంగా 8 సినిమాలు అంటే పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో ఆలోచించండి.


మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, నాగార్జున నా స్వామి రంగ, తేజ సజ్జ హనుమాన్, విజయ్ దేవరకొండ- పరుశురాం కాంబినేషన్లో వస్తున్న కొత్త మూవీ, వెంకటేష్ సైంధవ…ఇలా వరుసగా చిత్రాలు రేస్ లో ఉన్నాయి. అన్ని డిఫరెంట్ జానర్ చిత్రాలు కావడం తో ఈ సారి పోటీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ మూవీస్ అన్ని ఒకేసారి రావడం పాపం దిల్ రాజ్ కు తలనొప్పి తెచ్చేలా ఉన్నాయి.

ఇంతకీ ఈ చిత్రాలకు దిల్ రాజు ఒత్తిడికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ కారణం ఏమిటంటే.. ఈ సంక్రాంతికి బరిలో దిగనున్న విజయ్ దేవరకొండ మూవీ దిల్ రాజ్ సొంత బ్యానర్ నుంచి వస్తోంది. ఇంకా రిలీజ్ కాబోతున్న చిత్రాలలో మూడుటికి నైజాం హక్కులను దిల్ రాజ్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ మూడిటిలో మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ గుంటూరు కారం చిత్రం ఒకటి. ప్రస్తుతం రాబోయే సంక్రాంతికి అతి పెద్ద అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అది గుంటూరు కారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా థియేటర్లు కూడా ఎక్కువగా అరేంజ్ చేయక తప్పదు. మరోపక్క సొంత బ్యానర్ పైన చిత్రం కాబట్టి విజయ్ దేవరకొండ మూవీకి కూడా ఎంతో కొంత థియేటర్స్ ను ఇవ్వాలి.


ఇటు అగ్ర హీరోల సినిమాలు ఉన్నాయి…వాళ్లకు సరిపడినన్ని థియేటర్ లు ఇవ్వకపోతే ఫాన్స్ ఒప్పుకోరు. ఇలా కొనగోలు చేసిన చిత్రాలతో పాటు వచ్చే చిత్రాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ థియేటర్లను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. నిజానికి ఇలాంటి పరిస్థితిలో మామూలుగా ఇతర సినిమా మేకర్స్ తో మాట్లాడి రిలీజ్ డేట్ ను కాస్త అటు ఇటు మార్చే దానికి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి సంక్రాంతి సీజన్ కావడం తో ఏ సినిమాకి కూడా డేట్ పోస్ట్ ఫోన్ చేసుకునే ఉద్దేశం కనిపించడం లేదు. కాబట్టి ఇక సినిమాలకు ఉన్న హైప్ ని పట్టి మాత్రమే థియేటర్లు కేటాయించడం కుదురుతుంది… ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ ప్రక్రియ ప్రెషర్ మొత్తం ప్రస్తుతం దిల్ రాజు పైనే ఉందని తెలుస్తోంది. మరి దిల్ రాజ్ ఈ సిచువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×