BigTV English
Advertisement

Kuberaa: మూడు రోజుల్లో సినిమా రిలీజ్.. ఎవరైనా పట్టించుకోండయ్యా ?

Kuberaa: మూడు రోజుల్లో సినిమా రిలీజ్.. ఎవరైనా పట్టించుకోండయ్యా ?

Kuberaa: సినిమా ఎంత బడ్జెట్ పెట్టి చేసాము అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు ప్రేక్షకుల్లోకి ఆ సినిమాను ఎంతవరకు తీసుకెళ్లాము అనేది ముఖ్యం. ఒక సినిమా విజయాన్ని సాధించాలంటే ప్రమోషన్స్ లేకుండా ఆ పని జరగదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ కంటే ప్రమోషన్స్ కు పెట్టే బడ్జెట్ ఎక్కువ అని చెప్పొచ్చు. చిన్న హీరో అయినా స్టార్ హీరో అయినా తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ఆ సినిమా విజయాన్ని అందుకోలేక పోయినట్టే. అందుకే టాలీవుడ్ లో చాలామంది మేకర్స్ తమ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్స్ కొత్త రీతిలో చేస్తూ సినిమాపై హైప్ ను పెంచుతూ ఉంటారు.


 

ఒకప్పటిలా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అని మౌత్ టాక్ తోనే థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం లేదు. అసలు ఆ సినిమాలో ఏముంది ..? ప్రజలకు ఆ హీరో ఏం చెప్పాలనుకుంటున్నాడు..? అదంతా ప్రమోషన్స్ ద్వారా చెప్తేనే ప్రజలు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలా..?  వద్దా..? అని ఆలోచిస్తున్నారు .అయితే అసలు ప్రమోషన్స్ కూడా లేని సినిమాను చూడాలి అంటే ప్రేక్షకులు  ఓటీటీకి వస్తే చూద్దాంలే అని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మూడు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని మేకర్స్ కానీ నటీనటులు కానీ ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ చేయలేదు అని చెప్పవచ్చు. ఆ సినిమా ఏదో కాదు కుబేర. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర జూన్ 20న రిలీజ్ కు రెడీ అవుతుంది. నాగార్జున సినిమా అంటే ఎంత హైప్ ఉండాలి. కానీ, కుబేరకు అలాంటి బజ్ అసలు లేదనే చెప్పాలి. మూడు రోజుల్లో సినిమా పెట్టుకుని ఇప్పటివరకు ధనుష్ కానీ, నాగార్జున కానీ..  చివరికి రష్మిక కూడా కుబేరకు సంబంధించిన ఒక్క ఇంటర్వ్యూలో కూడా పాల్గొనలేదు. అసలు ఈ సినిమా జూన్ 20 న రిలీజ్ అవుతుందా అనే అనుమానం అభిమానుల్లో కూడా రేకెత్తుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కనీసం స్టార్స్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు.

 

నాగార్జున ఈమధ్యనే ఒక హిందీ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఎవరు కుబేరాను పట్టించుకున్నది లేదు అని చెప్పొచ్చు. సార్ సినిమా టైంలో కనీసం నాగవంశీ అయినా వెంకీ అట్లూరితో కలిసి ప్రమోషన్స్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకు శేఖర్ కమ్ముల అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం తప్ప ఫుల్ ప్లెడ్జ్ డ్  గా కుబేర ప్రమోషన్స్ చేసినట్లు ఎక్కడ కనిపించడం లేదు. దీంతో అసలు ఇది స్టార్ హీరోల సినిమానేనా అని అనుమానం కూడా కనిపిస్తుంది. ఎంత కథ బాగున్నా కూడా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకులను థియేటర్ వైపు తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ విషయం తెలిసికూడా కుబేర చిత్ర బృందం ఇలా ప్రమోషన్స్ లేకుండా సినిమాను విజయవంతంగా నడిపించాలని చూస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ రెండు రోజుల్లో నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల ఏదైనా ఇంటర్వ్యూ  ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×