Hari Hara Veeramallu Business : జూన్ 12 కూడా పోయి దాదాపు వారం కావొస్తుంది. ఇంకా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అసలు హరి హర వీరమల్లు విడుదల అవుతుందా ? అనే అసహాయమైన క్వశ్చను పవన్ అభిమానుల నుంచి వస్తుంది. అంతలా డీలా పడిపోయారు మరి వాళ్లు. మెల్లిగా ఆశలు వదులకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన బజ్ నీరుగారిపోతుంది.
అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరూ ఈ సినిమాను మర్చిపోతున్నారు. అయినా… నిర్మాతలు సైలెంట్‌గానే ఉంటున్నారు.
జూన్ 12న సినిమా రిలీజ్ చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి – సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ పూర్తి కాకపోవడం. ఇక రెండోది – బిజినెస్.
ఓటీటీ బిజినెస్ జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు హరి హర వీరమల్లు ఓటీటీ హక్కులను తీసుకున్నారు. డీల్ జరిగినప్పుడు ఓ ప్రైజ్ అనుకున్నారు. కానీ, ఈ మూవీ వాయిదా పడుతుంటే, ఆ ప్రైజ్‌లో ప్రైమ్ వాళ్లు కోతలు విధిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
బయ్యర్లను మెప్పించలేకపోతున్న వీరమల్లు
హరి హర వీరమల్లు వాయిదా పడటానికి ఒక కారణం.. పైన చెప్పుకున్నట్టు బిజినెస్ అవ్వకపోవడం. అందువల్లే జూన్ 12 నుంచి వాయిదా పడిందని చెప్పొకోవచ్చు. సీజీ వర్క్ కూడా కారణమే అనుకున్నా… బిజినెస్ అనేదే ఇప్పుడు మెయిన్ పాయింట్ అనుకోవచ్చు.
వాయిదా పడి ఇన్ని రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అప్డేట్స్ లేవు. దీంతో బయ్యర్లు మూవీని కొనుగోలు చేయడానికి అస్సలు ముందుకు రావడం లేదు.
నిర్మాత భారీ డిమాండ్స్ ?
దాదాపు 6 ఏళ్ల పాటు నడిచిన ప్రాజెక్ట్ కాబట్టి అనుకున్న దాని కంటే రెట్టింపు బడ్జెట్ అయింది. ఇప్పుడు లాభాలు కాదు… కట్టాల్సిన ఫైనాన్స్, దానికి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ వస్తే చాలు అనేలా నిర్మాతలు ఉన్నారు.
అందుకే ఏరియా వైజ్ రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారు. పవర్ స్టార్ అయినా… డిప్యూటీ సీఎం అయినా… కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్స్ గడప తొక్కుతారు.
పైగా ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా ఆడటం లేదు. బయ్యర్లు భారీగా నష్టపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అయినంత మాత్రనా.. మళ్లీ నష్టపోవడానికి వాళ్లు రెడీగా లేరు.
పవన్ ఆగ్రహం ?
టాలీవుడ్ ఇండస్ట్రీ బాగు కోసం పవన్ కళ్యాణ్ చేయాల్సింది చేశాడు. ఇప్పుడు తన సినిమాకు ఇలా బయ్యర్లు అడ్డుపడితే.. పవనేశ్వరుడు మూడో కన్ను తేరవడం గ్యారంటీ అనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే ఇదే సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటున్నారు అని పవన్ చాలా సీరియస్ అయ్యాడు. ఇప్పుడు తన సినిమా బిజినెస్ జరగకుండా అడ్డుకుంటున్నారు అని మళ్లీ సీరియస్ అవుతాడా ? మూడో కన్ను తెరుస్తాడా ? అంటే కచ్చితంగా అవునే సమాధానం రావొచ్చు.
ట్రైలర్‌తో ఏదో ఒకటి తెలిపోతుంది
సినిమాపై ఇప్పటి వరకు వచ్చిన బజ్ మొత్తం నీరుగారిపోయింది. మళ్లీ ఇప్పుడు జీరో నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్స్‌లో అడుగు పెట్టాలి. అన్నింటికీ మించి ట్రైలర్ బాగుండాలి. అప్పుడే బయ్యర్లు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
జూలై 25న రిలీజ్ ?
ఈ సినిమాను జూలై 25కు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.