Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. మలయాళ బ్యూటీ అయినా ఈమె ఏం మాయ చేసావే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రతి సినిమాను చేస్తూ బిజీ అయిపోయింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలు అందరి తరతరా నటించి స్టార్ హీరొయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమధ్య తెలుగులో సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. అయితే సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే సమంత దగ్గర అత్యంత ఖరీదైన వస్తువుల గురించి తెలుసుకోవాలని ఆమె అభిమానులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి ఆ ఖరీదైన వస్తువులు? వాటి కాస్ట్ వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సమంత సినిమాలు..
మలయాళ కుట్టి సమంత ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసునే మాయ చేసింది. దాంతో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీ లోకి వచ్చినా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఈమధ్య తెలుగులో సినిమాలు చేయలేదు. అందుకు కారణం అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత అందాల డోసు మరింతగా పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనట్లుగా సామ్ అందాల ప్రదర్శన ఉండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆమె పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ బిజీ అయ్యేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తుంది. అలాగే సినిమాలు కూడా చేసేందుకు సామ్ రెడీ అవుతుంది. అయితే ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాను నిర్మిస్తుంది. అందులో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. సామ్ దగ్గర అత్యంత ఖరీదైన వస్తువులు కొన్ని ఉన్నాయని తెలుస్తుంది. ఆ వస్తువుల వివరాలు తెలుసుకుందాం..
Also Read : బాక్సాఫీస్ ఊచకోత.. మరో రికార్డ్ బ్రేక్ చేసిన ‘హిట్ 3’..
సమంత దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు ఇవే..
హైదరాబాద్‌లో సమంతకు ఉన్న ఇంటి ఖరీదు సుమారుగా రూ.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆమె దగ్గర రూ.2.30 కోట్లు విలువ చేసే ల్యాండ్ రోవర్ కారు కూడా ఉంది. రూ.1.46 కోట్లు విలువ చేసే పోర్షె కేమాన్ జీటీఎస్ అనే మరో కారు కూడా ఆమె వద్ద ఉంది. అలాగే మరో రెండు కార్లు కూడా ఉన్నాయి. సమంత దగ్గర ఖరీదైన బ్యాగులు కూడా ఉన్నాయి. రెండున్నర లక్షలు విలువైన క్రిస్టియన్ డియర్ బ్యాగ్, రెండు లక్షల ఖరీదైనా లూయీస్ విట్టన్ బ్యాగ్, జీజీ మార్మోంట్ స్లింగ్ బ్యాగ్ ఉన్నాయి. మనోలో బ్లాహ్నిక్ బ్లాక్ హీల్స్ విలువ రూ. 1 లక్ష వరకు ఉంటుందని సమాచారం. అదే విధంగా సాకీ అనే దుస్తుల బ్రాండ్ కంపెనీలో రూ.30 కోట్ల మేర వాటాను కలిగి ఉంది.. ఇవే కాకుండా ముంబైలో కూడా ఖరీదైన ఇల్లు తో పాటు ఆస్తులు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి..