BigTV English

Rishabh Pant: బల్లెం వదిలిన రిషబ్ పంత్.. నీరజ్ చోప్రా లాగా గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందే

Rishabh Pant:  బల్లెం వదిలిన రిషబ్ పంత్..  నీరజ్ చోప్రా లాగా గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందే

Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఆదివారం రసవత్తర మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. లక్నో సూపర్ జెంట్స్ జట్టుపై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. ఈ నేపథ్యంలోనే ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరుచుకుంది పంజాబ్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సీజన్ లో 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కూడా రిషబ్ పంత్.. పెద్దగా రాణించడం లేదు. దానికి తోడు తన బ్యాటింగ్ కారణంగా ట్రోలింగుకు కూడా గురవుతున్నాడు.


నీరజ్ చోప్రాల మారిపోయిన రిషత్ పంత్

పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ ఔట్ అయిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 17 బంతుల్లో 18 పరుగులు చేసిన లక్ష్యం కెప్టెన్ రిషబ్ పంత్… అజ్మతుల్లా బౌలింగ్లో శశాంక్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నార్మల్ గా క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే పెద్దగా సమస్య ఉండేది కాకపోయేది. కానీ అజ్మతుల్లా బౌలింగ్లో… ముందుకు వచ్చి సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే… బ్యాట్ వదిలేసాడు. ఇంకేముంది బ్యాట్ కు తగిలిన బంతి నేరుగా శశాంక్ చేతిలో పడింది. అటు బ్యాటు పిచ్ మధ్యలో… నీరజ్ చోప్రా వదిలిన బల్లెం తరహాలో గాల్లోకి ఎగిరి కింద పడింది.


దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు చాలా నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి బ్యాటింగ్ రా నాయన…. రిషబ్ పంత్ ను బ్యాటింగ్ చేయమంటే… నీరజ్ చోప్రా తరహాలో జావలిన్ త్రో ఆడుతున్నాడేంటి ? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. వెంటనే మనోడిని నీరజ్ చోప్రా తో పాటు ఒలంపిక్స్ కు పంపించండి… ఖచ్చితంగా రిషబ్ పంత్ కు గోల్డ్ మెడల్ వస్తుందని చురకలు అంటిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

27 కోట్లు పెట్టి, దండగే

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్… ఈ 2025 టోర్నమెంట్లో పెద్దగా రాణించిన దాఖలాలే లేవు. మొన్నటి వరకు ఢిల్లీలో ఉన్న రిషబ్ పంతును…. లక్నో ఓనర్ సంజీవ్ పోటీపడి 27 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలోనే 27 కోట్లు తీసుకున్న రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ లో అయినా రాణించలేదు. పది మ్యాచ్లలో మొత్తం కలిపి 100 పరుగులు కూడా నింపలేదు. మొదటి మ్యాచ్లో డక్ అవుట్ అయిన రిషబ్ పంత్… ఆ తర్వాత 15 పరుగులు చేశాడు. అనంతరం రెండు పరుగులు, మరో మ్యాచ్ లో కూడా రెండు పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ పైన 21 పరుగులు, ఆ తర్వాత మ్యాచ్లో 63 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పైన మూడు పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో డక్ ఔట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ చేతిలో నాలుగు బరువులు చేసిన పంత్ నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగులు చేశాడు.

Related News

Sara Tendulkar :  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

Sri Lanka : అప్పుడు తండ్రులు దుమ్ము లేపారు… ఇప్పుడు కొడుకులు రంగంలోకి దిగారు.. శ్రీలంక జట్టుకు ఇక తిరుగులేదు

Smaran Ravichandran : SRH జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Big Stories

×