CIFF 2024 : ఈ మధ్యకాలంలో ప్రతి ఇండస్ట్రీ కూడా ఫిలిం ఫెస్టివల్ పేరిట ఆ ఏడాది ఉత్తమ నటన కనబరిచిన నటీనటులు, దర్శకులు టెక్నీషియన్స్ ఇలా 24 ఫ్రేమ్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి అవార్డ్స్ అందజేస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళ చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే “చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్” వేడుక ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కోలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు సందడి చేశారు. ఇక అందులో భాగంగానే కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ 22 వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా అవార్డులను అందించారు. మరి ఈ ఏడాది ఎవరెవరికి ఏ విభాగంలో అవార్డు లభించిందో ఇప్పుడు చూద్దాం.
ఉత్తమ చిత్రం : అమరన్..
స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్(Mukundh Varadarajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. శివ కార్తికేయన్ (Shiva karthikeyan) ముకుంద్ పాత్ర పోషించగా.. ఆయన భార్య ఇందు రెబెక్కా వర్గీస్ (Indu rebekka Varghese) పాత్రలో సాయి పల్లవి (Sai pallavi) లీనమైపోయి మరీ నటించింది. ఇక ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఉత్తమ చిత్రంగా నిలిచి అవార్డు అందుకుంది.
ఉత్తమ నటి.. సాయి పల్లవి
అమరన్(Amaran)సినిమాలో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో చక్కగా నటించింది..అంతేకాదు ఆ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి నటనకు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. ఇక అవార్డు లభించడంతో ఈ విజయం పై సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేసింది.. సాయి పల్లవి మాట్లాడుతూ..”22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా అవార్డు రావడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు విడుదలయ్యాయి. ఎంతో పోటీ కూడా నెలకొంది. కానీ ఇలాంటి సమయంలో ఆ పోటీని తట్టుకొని నన్ను అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు. వారు చూపించే ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది” అంటూ తెలిపింది.
ఉత్తమ నటుడు.. విజయ్ సేతుపతి (మహారాజ)
ఇక ఉత్తమ నటుడు విభాగంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అవార్డు అందుకోవడంతో ఆయన కూడా స్పందించారు. మహారాజా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.ముఖ్యంగా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపారు.
ఉత్తమ రెండవ చిత్రం – లబ్బర్ పందు
ఉత్తమ సినిమా ఆటోగ్రాఫర్ – సీహెచ్ సాయి – అమరన్
ఉత్తమ ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్ – అమరన్.
ఉత్తమ బాల నటుడు – పొన్వెల్ (వాళై)
ఉత్తమ సహాయ నటుడు – దినేష్ – లబ్బర్ పందు
ఉత్తమ రచయిత – నిథిలన్ స్వామినాథన్- మహారాజ
ఉత్తమ సంగీత దర్శకుడు – జీవి ప్రకాష్ – అమరన్
స్పెషల్ జ్యూరీ అవార్డు – మారి సెల్వరాజ్ (వాళై), పా. రంజిత్ (తంగలాన్).