Street Fight In Mahabubabad: రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నాయి. దాదాపు గంటలకు పైగా నడిరోడ్డుపై ఈ రణరంగం జరిగింది. ఆ రోడ్డు వైపు వెళ్లున్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ రేంజ్‌లో గొడవలు జరగడానికి కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
స్టోరీలోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా జీకే తండాకు చెందిన భద్రమ్మ- ఆ ప్రాంతానికి చెందిన రమేశ్ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా పంచాయితీ నడుస్తోంది. కేవలం చిన్నపాటి దారి లేదా బాట విషయంలో తమదంటే తమది అనే స్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై వీలు చిక్కినప్పుడల్లా చీటికి మాటికీ గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా ఇరు కుటుంబాల మధ్య ఈ తతంగం నడుస్తోంది.
చివరగా ఈ విషయం ఆ ఊరి పెద్దల వరకు వెళ్లింది. పలుమార్లు పంచాయితీ నిర్వహించిన గ్రామ పెద్దలు, ఇరు కుటుంబాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దారిని ఎవరి ఉపయోగించుకుంటే తప్పేంటి? ఎవరు చేసినా ఊరు మంచి కోసమే కథా అని చెప్పారు. పెద్దలైతే ఆ కుటుంబాల మధ్య రాజీ చేశారు కానీ, అంతర్గతంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
చిక్కంతా అక్కడే
ఓ వైపు పంచాయితీ నడుస్తుండగానే మంగళవారం మళ్లీ గొడవ జరిగింది. పెద్ద మనుషుల మధ్య కొట్లాడుకునే పని చేశారు. చివరకు ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న భద్రమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ పండుగ అంతా రెడీ చేసింది. ఈలోగా అక్కడికి వచ్చిన రమేశ్ కుటుంబ సభ్యులు, భద్రమ్మ ఇంటి వద్ద గొడవకు దిగారు.
ALSO READ: ఎంఎంటీఎస్ రైలులో ఘటనపై సీఎం రియాక్ట్
అసలే పల్లెటూర్లు.. మాటా మాటా ఆపై విద్వేషాలు అక్కడ అదే జరిగింది. ఇరు కుటుంబాలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. చివరకు రమేశ్ కుటుంబ సభ్యులు భద్రమ్మపై గొడ్డలితో దాడి చేశారు. ఆమెకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే తొర్రూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ట్రీట్‌మెంట్ చేయించారు. ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది.
ఆసుపత్రిలో బాధితులు
భద్రమ్మ తొర్రూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈలోగా రమేశ్ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. రాత్రి భద్రమ్మ తన కుటుంబ సభ్యులతో బయటకు వస్తుండగా మరోసారి దాడికి పాల్పడింది రమేశ్ ఫ్యామిలీ. తొర్రూరు మెయిన్ రోడ్డుపై ఇరువర్గాలు కుటుంబ సభ్యులు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
దాదాపు గంటపాటు ఆ రోడ్డుపై రణరంగం నెలకొంది. అక్కడ భయానక వాతావరణం నెలకొంది. నడి రోడ్డుపై గొడవ జరుగుతుండటంతో భయాందోళనకు గురై కొందరు అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేశారు. చివరకు ఈ విషయం పోలీసుల చెవిలో పడింది. వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ తతంగాన్ని అదే రోడ్డులో వెళ్తున్న ఓ వ్యక్తి తన ఫోన్‌తో ఫైటింగ్ దృశ్యాలను చిత్రీకరించి ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. నెట్టింట ఆ వీడియో వైరల్ అయ్యింది.
Clash Over Land Dispute Turns Violent on the Road in #Mahabubabad
A violent clash broke out between two groups over a land dispute in #GKTanda, #ThorrurMandal, Mahabubabad district.
According to sources, members of one group had gone to the hospital for treatment after… pic.twitter.com/RntgQH7Ejt
— BNN Channel (@Bavazir_network) March 26, 2025