Tollywood Singers: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు ఎంత పాపులారిటీ ఉంటుందో.. ఈ మధ్య సింగర్స్ కూడా అంతే పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా తమ పాటలతో శ్రోతలను అలరిస్తూ.. అటు సోషల్ మీడియా వేదికగా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు ఎలాగైతే ఇండస్ట్రీకి చెందిన వారిని వివాహం చేసుకుంటున్నారో.. అలాగే సింగర్స్ కూడా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకొని.. తమకంటూ ఒక కొత్త బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. అయితే అలా ప్రేమించుకున్న వారు జీవితాంతం తోడుంటున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. వైవాహిక బంధం లో ఒడుదుడుకులు ఏర్పడడంతో విడిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు వివాహం చేసుకొని విడిపోయిన సింగర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
సింగర్ మధుప్రియ..
ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు మధుప్రియ (Madhu Priya). ముఖ్యంగా ‘ఆడపిల్లనమ్మా’ అనే పాటతో భారీ పాపులారిటీ అందుకున్న సింగర్ మధుప్రియ తన గాత్రంతో శ్రోతలను అలరించింది. అయితే ఈమె తన భర్త శ్రీకాంత్ (Srikanth) నుండి కొంతకాలం దూరంగా ఉండి, ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.
సింగర్ కౌసల్య..
తన అద్భుతమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సింగర్ కౌసల్య (Kousalya ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పాట పాడింది అంటే శ్రోతలు తమను తాము మైమరిచిపోతారు. అలా తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. వైవాహిక బంధంలో విమర్శలు ఎదుర్కొంది. ఇబ్బందులు చవిచూసింది. జీవితాంతం తోడుంటాను అని ప్రామిస్ చేసిన వ్యక్తి దూరమయ్యాడు. కొడుకు పుట్టిన దగ్గరి నుంచి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని అతడికి దూరం అయ్యి, కొడుకుతోపాటు జీవనాన్ని కొనసాగిస్తోంది.
సింగర్ సునీత..
అందానికి అందం, అంతకుమించిన స్వరం.. తన స్వరంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఒక్కసారి గొంతు విప్పిందంటే చాలు కోకిల కంటే మధురంగా ఉంటుంది సునీత (Sunitha) వాయిస్. అందుకే సునీతకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే సునీత.. వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కిరణ్ (Kiran ) అనే వ్యక్తిని ప్రేమించి, అతి చిన్న వయసులోనే కుటుంబాన్ని కాదనుకొని మరీ వెళ్ళిపోయి, అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అతడి నిజస్వరూపం తెలుసుకున్న సునీత.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చి, ఒంటరి అయింది. ఇద్దరు పిల్లలతో జీవితం అనే బ్రతుకు బండిని సాగిస్తూ ముందుకు సాగింది. ఆ బాటలో ఎన్నో అవమానాలు, ఆరోపణలు, హేళనలు, చీత్కారాలు ఇంకా మరెన్నో.. అన్నింటిని భరిస్తూ నేడు ఈ స్థాయికి వచ్చింది. ఇక ప్రస్తుతం మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని (Ram Veerapaneni) నీ బిడ్డల కోరిక మేరకు వివాహం చేసుకొని, కొత్త బంధాన్ని ఆస్వాదిస్తోంది. ఒకవైపు పలు చిత్రాలలో పాటలు పాడుతూనే.. మరొకవైపు ‘సరిగమప’ వంటి సింగింగ్ కాంపిటీషన్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సునీత రెండవ వివాహం చేసుకొని సంతోషంగా జీవిస్తున్న విషయం తెలిసిందే.
సింగర్ కల్పన.
చాలా సినిమాలలో పాటలు పాడి తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మైమరిపింప చేసిన కల్పనా (Kalpana ) కూడా తన భర్తకు విడాకులు ఇచ్చారు. ఇప్పటికీ ఈమె సింగిల్గానే ఉన్నారు.
సింగర్ నోయల్..
ప్రముఖ హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా (Ester Noronha) ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు నోయెల్ (Noel).. పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
సింగర్ హేమచంద్ర
ప్రముఖ సింగర్ శ్రావణి (Sravani)ని వివాహం చేసుకున్నారు సింగర్ హేమచంద్ర(Hema Chandra). అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరు విడాకులు తీసుకున్నారేమో అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరి వీరిద్దరూ నిజంగానే కలిసున్నారా లేక విడిపోయారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
Kamakshi Bhaskar: తేళ్లు, బొద్దింకలు తిన్నాను… ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్..!