BigTV English

Celebraties Birthday on Leap Year: లీప్ ఇయర్‌.. ఫిబ్రవరి 29న బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే తారలు వీరే..

Celebraties Birthday on Leap Year: లీప్ ఇయర్‌.. ఫిబ్రవరి 29న బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే తారలు వీరే..
Celebraties Birthday on Leap Year
 

Celebraties Birthday on this Leap Year: పుట్టినరోజు.. ప్రతి ఏడాది ప్రతి ఒక్కరు ఆ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. సెలబ్రిటీలు సైతం అందుకు అతీతులు ఏమి కారు. పుట్టినరోజు అంటే ఆనందం.. కుటుంబ సభ్యులతో గడపొచ్చు. స్నేహితులతో పార్టీలు.. తాము పుట్టినందుకు ఎంతో సంతోషించేవారి మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు.


అయితే ప్రతి ఏడాది బర్త్ డే సెలబ్రేట్ చేసుకొనీ వారు ఉన్నారు. అంటే డబ్బులు లేక, జరుపుకోవడం ఇష్టంలేక కాదు.. లీప్ ఇయర్‌లో పుట్టడం వలన. లీప్ ఇయర్ గురించి అందరికి తెల్సిందే. నాలుగేళ్లకు వచ్చే లీప్ ఇయర్.. అనగా ఫిబ్రవరి 29 అన్నమాట. అందరిలా సాధారణంగా పుట్టినవారు.. ప్రతి ఏడాది పుట్టినరోజులు గ్రాండ్ గా జరుపుకుంటారు.

Read More: షాకిచ్చిన త్రిష, చాలామందితో రిలేషన్ పెట్టుకున్నానంటూ..


కానీ లీప్ ఇయర్‌లో పుట్టినవారు మాత్రం తమ పుట్టినరోజును నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే జరుపుకుంటారు. కొంతమంది అయితే ఆరోజు పుట్టినరోజు జరుపుకోలేక.. ఫిబ్రవరి 28 నో, లేక మార్చి 1 నో తమ బర్త్ డేలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే.. హా.. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు.. మనకు కనిపిస్తారా.. ? అనుకుంటే పొరపాటు.

సెలబ్రిటీలలో కూడా లీప్ ఇయర్‌లో పుట్టినవారు ఉన్నారు. మూడేళ్లు తమ పుట్టినరోజు కోసం ఎదురుచూసి.. నాలుగో యేడు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే 2024 లీప్ ఇయర్. మరి ఈ మూడేళ్లు వేచి చూసి రేపు అదేనండీ ఫిబ్రవరి 29న పుట్టినరోజును జరుపుకోబోతున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్ వేద్దామా.. ?

జా రూల్.. ఇతనొక ర్యాపర్, సింగర్, నటుడు.. జెఫ్రీ బ్రూస్ అట్కిన్స్ సీనియర్, అతని రంగస్థల పేరు జా రూల్‌తో సుపరిచితుడు, ఒక అమెరికన్ ర్యాపర్. న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగిన జా రూల్ 2000ల హిప్ హాప్‌లో గ్యాంగ్‌స్టా రాప్‌ను వాణిజ్యపరంగా-ఆధారిత పాప్ సెన్సిబిలిటీలతో కలపడం ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇతని సాంగ్స్ ఇండియాలో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్నాయి. ఇతగాడు లీప్ ఇయర్‌లో పుట్టాడు. రేపు ఇతని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

Read More: వారికి అసలు మానవత్వం లేదా అంటూ మహేశ్ వైరల్ పోస్ట్

రాఖీ ఠాక్రార్.. ఈమె ఒక అమెరికన్ నటి. నెట్ ఫ్లిక్స్‌లో ట్రెండ్‌లో నడుస్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్‌లో రాఖీ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాదు.. ఎన్నో మంచి సినిమాలు, సిరీస్‌లలో ఆమె నటించింది. ఇక ఆమె కూడా లీప్ ఇయర్‌లోనే పుట్టింది.

వీరు కాకుండా గాయకుడు ఖలేద్, మరో హిందీ నటి జాన్వీ చేదా కూడా లీప్ ఇయర్‌లోనే పుట్టారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీస్ లీప్ ఇయర్‌లో పుట్టి.. నాలుగేళ్లకు ఒకసారి తమ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అందరికంటే వీరు ప్రత్యేకం.. అందుకే వీరికి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చడానికి మన తరుపున బర్త్ డే విషెస్ చెప్పి వారిని సంతోషపరుద్దాం.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×