BigTV English
Advertisement

Rajamouli: జక్కన్న డైరెక్షన్లో సినిమా చేసినా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన హీరోలు వీళ్లే..!

Rajamouli: జక్కన్న డైరెక్షన్లో సినిమా చేసినా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన హీరోలు వీళ్లే..!

Rajamouli:టాలీవుడ్ సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందించిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి (Rajamouli) మాత్రమే. అందుకే రాజమౌళి డైరెక్షన్లో వచ్చే సినిమాలలో కనీసం ఒక చిన్న పాత్ర అయినా చేయాలి అని చాలామంది నటీనటులు ఆరాటపడతారు. ఎందుకంటే ఆయన సినిమాలో పనిచేసే ప్రతి పాత్రకి కూడా అంతలా ఆయన ప్రాముఖ్యత కల్పిస్తారు. అందుకే ఆఖరికి జూనియర్ గా అయినా సరే సినిమాలో భాగం కావాలి అని కోరుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇక ఒక్కసారి రాజమౌళి సినిమాలో నటించారంటే, ఇక వారి స్టేటస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి రాజమౌళి దర్శకత్వంలో హీరోగా సినిమాలు చేసి, స్టార్ స్టేటస్ ను పొందలేకపోయిన హీరోలు ఉన్నారంటే.. ఎవరైనా నమ్మగలరా..? ఒక్కసారి వెనక్కి చూస్తే ఇది నిజం అనే చెప్పాలి. బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ పెరిగిందే తప్ప బాహుబలికి ముందు రాజమౌళి తో సినిమాలు చేసిన హీరోలు ఇప్పటికీ స్టార్ స్టేటస్ ను అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. మరి అలా రాజమౌళి డైరెక్షన్లో సినిమాలు చేసిన ఇప్పటికీ స్టార్ స్టేటస్ కోసం ఆరాటపడుతున్న హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.


నాని..

నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని (Nani)స్టార్ హీరో హోదాను దక్కించుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమిందారు’ లాంటి చిన్న సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న నానికి, రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’ సినిమా చేసే అవకాశం వచ్చింది. దానితో ఆయన ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోతారని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలు తలకిందులైపోయాయి. ఇప్పటివరకు ఆయన ఎన్నో సినిమాలు చేసినా టైర్ -2 హీరో గానే చలామణి అవుతున్నారు.


నితిన్..

‘సై’ సినిమాతో నితిన్(Nithin)కి రాజమౌళి దర్శకత్వంలో చేసే అవకాశం లభించింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. ఆ తర్వాత నితిన్ చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఆయన జనాల్లో ఇమేజ్ ని కోల్పోయారు. ఆ తర్వాత ‘ఇష్క్’ సినిమాతో మళ్ళీ సక్సెస్ అందుకున్నారు. కానీ ఇప్పటికీ స్టార్ స్టేటస్ కోసం పోరాడుతున్నారు.

సునీల్..

సునీల్(Sunil)ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టిన చిత్రం ‘మర్యాద రామన్న’. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. కమెడియన్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సునీల్, ఈ సినిమాతో హీరోగా మరింత పాపులారిటీ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా చేశారు. కానీ అవేవి కూడా ఈయనకు గుర్తింపును అందివ్వలేదు. ప్రస్తుతం మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ సినిమాలో మంగళం శీను క్యారెక్టర్ లో విలన్ గా చేశారు కానీ పెద్దగా గుర్తింపు వచ్చినట్లు కనిపించడం లేదు అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×