BigTV English

Horror Movies In Youtube : భయంకరమైన హారర్ సినిమాలు.. ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి..

Horror Movies In Youtube : భయంకరమైన హారర్ సినిమాలు.. ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి..

Horror Movies In Youtube : వణుకు పుట్టించే సన్నివేశాలతో, గుండె దడ పెంచే స్టోరీతో హారర్ మూవీస్‌, వెబ్ సిరీసులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి భయపెట్టే హారర్ చిత్రాలు, సిరీసులను చూసేవారి కోసం ప్రతివారం ఓటీటీ సంస్థలు రిలీజ్ చేస్తుంటాయి. కానీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేనివారికోసం యూట్యూబ్‌లో అన్ని రకాల జోనర్స్ మూవీస్ రిలీజ్ చేస్తుంటారు.. యూట్యూబ్ లో ఈ ఏడాది లెక్క లేనన్ని సినిమాలు విడుదల అయ్యాయి.. ఆ సినిమాలు ఏవో? ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయో ఒకసారి తెలుసుకుందాం..


కాలింగ్ బెల్.. 

ఈ మూవీ మొత్తం ఒక ఇంట్లోనే జరుగుతుంది. కొత్తగా పెళ్లి చేసుకొని కాపురానికి ఓ జంట ఓ ఇంట్లోకి వస్తారు. అక్కడ ఆల్రడీ దెయ్యం తిష్ట వేసి ఉంటుంది. అది తెలియక చాలా సంతోషంగా గడుపుతారు. కానీ వాళ్లకు ఇంట్లో మార్పులు రావడం గమనిస్తారు. ఇంట్లో దెయ్యం కనిపిస్తుంది. దాంతో వాళ్ళు భయంతో ఆ ఇంటిని ఖాళీ చేస్తారు. అదే ఇంటికి కొందరు ఫ్రెండ్స్ వస్తారు. అప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగిందనే కథతో కాలింగ్ బెల్ మూవీ తెరకెక్కించారు. కొన్ని థ్రిల్ల్స్, హారర్ సీన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. దీనికి సీక్వెల్‌ కూడా తెరకెక్కించారు..


రాక్షసి.. 

కాలింగ్ బెల్ అనే హారర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ఇద్దరు పిల్లల తల్లిగా లీడ్ రోల్ చేసింది. ఓ ఇంట్లోకి పిల్లలతో దిగిన పూర్ణ తనకు ఎదురైన అనుభవాల గురించి ఓ స్వామిజీకి చెబుతుంది. అప్పుడు స్వామిజీ చెప్పిన నిజాలు విని షాక్ అవుతుంది.. ఆ ఇంట్లో దెయ్యాన్ని తరిమి కొట్టారా? లేక ఆ దెయ్యానికి బలైపోయారా అనేది తెలియలేదు.. అదే సస్పెన్స్ స్టోరీ.. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమాను తప్పక చూడాల్సిందే..

ఎలా 7.. 

ఇదొక హిందీ డబ్ మూవీ యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను అందుకుంది. మిలియన్ వ్యూస్ ను రాబట్టిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హరర్ సినిమాల్లో రొటీన్‌గా ఉండే కథతోనే ఈ సినిమా స్టోరీ ఉంటుంది. కొత్తగా ఓ ఇంట్లోకి దిగిన ఓ జంటకు ఎదురైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే, ఒంటరిగా అమ్మాయి ఉన్నప్పుడు మాత్రమే దెయ్యం భయపెడుతుంది. అలా ఎందుకు జరుగుతుంది. అసలు కారణాలు ఏంటీ అనేదే సినిమా కథ..

డిమోంటీ కాలనీ..

నలుగురు ఫ్రెండ్స్ సరదాగా గడుపుతుంటారు. అక్కడ ఎంతోమంది చాలా రకాలుగా చెప్పుకునే ఓ పాత భవనంలోకి సరదాగా వెళ్తారు.. అక్కడి నుంచి వచ్చేవాళ్లకు ఓ నెక్లెస్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది, వారు ఎలాంటి సంఘటనలు ఫేస్ చేశారు అనేదే సినిమా కథ. ఊహించని ట్విస్టులతో మంచి హారర్ ఎఫెక్ట్‌తో ఈ సినిమా స్టోరీ ఉంటుంది. మూవీ మొత్తం సస్పెన్స్ సన్నివేశాలతో సాగుతుంది. భారీ వ్యూస్ ను అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా కూడా మూవీ వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ మూవీలన్ని యూట్యూబ్ లో బెస్ట్ హారర్ సినిమాలు.. ఇప్పటికి మీరు ఫ్రీగా చూడొచ్చు..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×