Saif alikhan – YS. Sharmila: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) ఇటీవల కత్తి దాడికి గురైన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ముంబై పోలీసులు కూడా థానే లో నిందితుడు ఉన్నాడని గుర్తించి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీఖాన్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా మారిన వైయస్ షర్మిల (YS. Sharmila)కు సైఫ్ అలీఖాన్ కి విచిత్రమైన బంధం ఉంది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రత్యేక అనుబంధం..
సైఫ్ అలీఖాన్ పై ఒక దొంగ డబ్బు కోసమే అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చినప్పటికీ.. కృష్ణ జింకను వేటాడిన నేపథ్యంలో ప్రతీకారంగా బిష్ణోయ్ గ్యాంగ్ కత్తితో దాడికి పాల్పడినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తొలిసారి ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఆది పురుష్ (Adi purush) సినిమాలో రావణాసురుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడుగా మారిన సైఫ్ అలీ ఖాన్, ఆ తర్వాత ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన దేవర (Devara) సినిమాలో కూడా భైరవ పాత్రలో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈయనకు ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం కుటుంబం అయిన వైఎస్ఆర్(YSR) కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని సమాచారం.
సైఫ్ అలీ ఖాన్ కు వైయస్సార్ కుటుంబానికి మధ్య ఉన్న విచిత్రమైన అనుబంధం..
అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న షర్మిల ఠాకూర్ (Sharmila thakur ) కొడుకే సైఫ్ అలీ ఖాన్. ఈమె అప్పటి మన దేశ క్రికెట్ కు కెప్టెన్ గా పనిచేసిన మన్సూర్ అలీ ఖాన్ ను ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది..ఇకపోతే షర్మిల ఠాకూర్ ఒకప్పటి యువతకు కలల రాణి అని చెప్పవచ్చు. అంతేకాదు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhar reddy ) కూడా ఆమెకు వీరాభిమాని అట. ఆ అభిమానంతోనే ఆయన తన కూతురికి తన ఫేవరెట్ హీరోయిన్ అయిన షర్మిల పేరు పెట్టుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అంతగా ఈ పేరు పెట్టుకోరు.. వాస్తవానికి ఉత్తరాది వాళ్లే ఎక్కువగా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. అందుకే సైఫ్ అలీ ఖాన్ కు వైయస్సార్ కుటుంబానికి మధ్య ఉన్న విచిత్రమైన అనుబంధం ఇదే అని సమాచారం. ఏది ఏమైనా ఈ విషయం కాస్త అటు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పవచ్చు.
సైఫ్ అలీ ఖాన్ కెరియర్..
సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే తండ్రి బాటలో క్రికెటర్ కాకుండా.. తల్లి బాటలో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. మొదట అమృత సింగ్ (Amrita singh) అనే నటిని వివాహం చేసుకొని, 13 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మరొక నటి కరీనాకపూర్ (Kareena kapoor) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.