Amit Shah In Vijayawada: ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలోనే విజయవాడ కొండపావులూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదరన్ క్యాంపస్ ను కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా ప్రధానంగా చంద్రబాబును ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.
ముందుగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని, కేంద్రం సహకారంతోనే రాష్ట్ర రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఐ కోసం తెలుగుదేశం ప్రభుత్వంలోని భూములను ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం వాటికి సంబంధించిన సదరన్ క్యాంపస్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ప్రకృతి విపత్తుల సంభవించిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక దేశ సంపదను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పీఎం మోడీ సహకారంతో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని, ఇప్పటికే ఎన్నో కోట్లు పెట్టుబడులను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందన్నారు.
అమిత్ షా మాట్లాడుతూ.. ఏపీలో సీఎం చంద్రబాబు తన విజన్ ప్రకారం పాలన కొనసాగిస్తూ, అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచారన్నారు. సీఎం చంద్రబాబు, పీఎం మోడీల సహకారంతో ఏపీలో పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఏపీ మూడు రెట్ల అభివృద్ధి వైపు సాగుతుందని, చంద్రబాబు ప్రత్యేక రోడ్ మ్యాప్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారన్నారు.
Also Read: V.K.Naresh: అమ్మకు పద్మ అవార్డు రావడానికి పోరాటం చేస్తా.. కీలక వ్యాఖ్యలు చేసిన నరేష్..!
కేవలం 6 నెలల వ్యవధిలో రూ. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఏపీకి కేటాయించిన ఘనత కూటమికి దక్కుతుందన్నారు. అంతేకాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11455 కోట్ల రూపాయల నిధులను అందించేందుకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, ఏపీ ప్రజలతో పాటు చంద్రబాబు కలలుగన్న రాజధాని త్వరలో ప్రజల ముందుకు వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రదర్శించిన విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.