YELLAMMA : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరి పొజిషన్ ఎలా మారుతుందో ఎవరో ఊహించలేరు. చాలామంది నటులుగా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా జబర్దస్త్ అనే షో చాలామంది కమెడియన్సును తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్స్ ఇంకో ఇండస్ట్రీలో లేరు అనేది కూడా వాస్తవం అని చెప్పాలి. ఒక జబర్దస్త్ మొదలైన కొత్తలో చాలామంది సినిమాల్లో అప్పటికే నటించిన కమెడియన్స్ ఉండేవాళ్ళు. ఆ నటులని జబర్దస్త్ టీవీ షో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఇకపోతే జబర్దస్త్ షో వలన చాలా కాంట్రవర్సీలు కూడా ఏర్పడ్డాయి. ఒక స్కిట్ వలన వేణు ను కొంతమంది దాడి చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వేణు దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
బలగం సినిమాతో సక్సెస్
వేణు దర్శకుడుగా పరిచయమైన సినిమా బలగం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వచ్చిన ఈ సినిమా చాలా చిన్న సినిమాలకు మంచి బలాన్ని ఇచ్చింది అని చెప్పాలి. ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా కూడా మరో నిదర్శనం. ఈ సినిమా తర్వాత నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా నాని చేయడం లేదు. ప్రస్తుతం ఈ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు.
Also Read : Gopichand Malineni : కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవ్వక రవితేజ ప్రాజెక్టు వదిలేయాల్సి వచ్చింది
ఎల్లమ్మ స్టోరీ లైన్
ఈ సినిమా కథ ఒక తక్కువ కులానికి చెందిన కొంతమంది సింగర్స్ ట్రూప్ కు సంబంధించినది అని తెలుస్తుంది. దీనిలో ఒక ఎమోషనల్ జర్నీ మరియు వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి. అయితే ఈ సినిమాలో ఎల్లమ్మ రోల్ పవర్ఫుల్ గా ఉండబోతుంది. దీనికోసం ముందుగా హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించారట. తను చేయనని చెప్పేసింది. ఆ తర్వాత కీర్తి సురేష్ ని సంప్రదిస్తే తనకి డేట్స్ కుదరటం లేదు అని చెప్పినట్లు సమాచారం. ఇక శ్రీ లీల (Sreeleela) విషయానికొస్తే వరుసగా డిజాస్టర్ సినిమాలు ఆమెను వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Single Movie : శ్రీ విష్ణు ఇక మంచు కురిసిపోయినట్లేనా..? ఆ డైలాగ్ పై హీరో సీరియస్… కేసు కూడా..?