BigTV English
Advertisement

Telugu Movie : ప్రమోషన్స్ కోసం 2 కోట్లు టోకరా… నిర్మాతను నిండా ముంచేశాడు

Telugu Movie : ప్రమోషన్స్ కోసం 2 కోట్లు టోకరా… నిర్మాతను నిండా ముంచేశాడు

Telugu Movie : అవును సినిమాలు హిట్ అవ్వాలంటే… కంటెంటే ఇంపార్టెంట్. కానీ, మొన్నా ఆ మధ్య సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రొడ్యూసర్లు అందరూ దీన్ని మర్చిపోయారు. కంటెంట్ ఉన్నా.. లేకున్నా.. ప్రమోషన్స్ అయితే గట్టిగా చేయాలని చూస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు. హీరో, హీరోయిన్లకు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ ప్రమోషన్స్‌ను ఇన్‌క్లూడ్ చేస్తున్నారు.


దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడు నిర్మాతలు మూవీ ప్రమోషన్స్‌పై ఎలాంటి ఫోకస్ పెట్టారో… దీన్నే బాగా అర్థం చేసుకున్నాడు ఓ ప్రముఖ వ్యక్తి. ప్రమోషన్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు కదా అని… ఓ నిర్మాత దగ్గర 2 కోట్లు తీసుకుని మోసం చేశాడట. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ సినిమాల టార్గెట్… ఆడియన్స్‌ను మెప్పించడమే. అందుకోసం పడరాని పాట్లు పడుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీం చేసిన ప్రమోషనల్ స్టంట్లు చూసి ఈ మధ్య అందరూ అదే దారిలో వెళ్తున్నారు.


ముఖ్యంగా ప్రమోషన్స్ పై నిర్మాతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు అన్నది అందరికీ తెలిసిందే. దిల్ రాజు, సితార నాగ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ప్రమోషన్స్ కోసం డైరెక్ట్ ఇంవోల్వ్ అవుతున్నారు.

ఇదిలా ఉందగా… గత వారం రిలీజ్ అయిన ఓ సినిమా విషయంలో ఓ ఘటన జరిగిందట. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది.. భారీగా ప్రమోషన్స్ చేయాలి అంటూ నిర్మాత దగ్గర చాలా మాటలు చెప్పారట. అంతే కాదు, ప్రమోషన్స్ కోసం 2 కోట్లు ఇవ్వాలని అన్నాడట. మూవీ ప్రమోషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి… ఆ ప్రొడ్యూసర్ కూడా ఆ ప్రముఖ వ్యక్తి అడిగినట్టు… 2 కోట్ల రూపాయలను ఇచ్చేశాడట.

తీరా… చూస్తే, ఆ డబ్బులతో ఆ ప్రముఖ వ్యక్తి ప్రమోషన్స్ చేయడం లాంటివేమీ కూడా లేదట. ఆ డబ్బులను మొత్తం వెనకేసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఆ ప్రముఖ వ్యక్తిని నమ్మి ప్రొడ్యూసర్ 2 కోట్లు మోస పోయాడు అంటూ ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. నిజానికి సినిమా ప్రమోషన్స్ జరగాలి. దాని కోసం నిర్మాతలు ఈ రోజుల్లో ఎంత ఖర్చు చేయడానికి అయినా… ముందుకు వస్తున్నారు. నిర్మాతల విక్‌నెస్ పట్టుకుని ఇలా డబ్బులు దోచేయ్యడం సరికాదు అని అంటున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×