BigTV English
Advertisement

Balayya : బాలయ్య గురించి ఎవ్వరికి తెలియని విషయాలు.. అందుకే లెజెండ్ అయ్యాడు..!

Balayya : బాలయ్య గురించి ఎవ్వరికి తెలియని విషయాలు.. అందుకే లెజెండ్ అయ్యాడు..!

Balayya : సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చెప్పి డైలాగులు, డాన్స్ స్టెప్పులు, ఏ సినిమా చేసినా కూడా ఫ్యాన్స్ కు బాగా నచ్చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలో నటన ఇరగదీయడంలో బాలయ్యదే పైచేయి అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అనేక బాలయ్య మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.. అయితే బాలయ్య గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇండస్ట్రీలోని మిగతా హీరోలు చాలా వరకు రీమేక్ సినిమాలు చేస్తారు. కానీ నందమూరి బాలయ్య మాత్రం ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేసిన దాఖలాలు లేవు. ఆయన సినిమాలనే చాలామంది హీరోలు వేరే ఇండస్ట్రీలలో రీమేక్ చేశారు.. సక్సెస్ సాధించారు. ఇక బాలయ్య 17 సినిమాల్లో డ్యుయల్ రోల్‌లో కనిపించారు. అలాగే అధినాయకుడు మూవీలో మూడు పాత్రల్లో నటించారు.. అందుకే బాలయ్య లెజెండ్ అయ్యారు. ఇక 1987లో బాలయ్య నటించిన ఎనిమిది సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకోవడం విశేషం. అంతే కాదు ఈయన నటించిన 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. అలాగే బాలయ్య ఇప్పటి వరకు 6 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 3 నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సినిమాల గురించి ఫ్యాన్స్ మళ్లీ చర్చించుకుంటున్నారు.. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరవలేనివిని అభిమానులు ఆయనకు జేజేలు పలుకుతున్నారు.

బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి. అంతేకాకుండా 50 ఏళ్లుగా సినిమా రంగంలో విశేష సేవలందించినందుకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.. బాలయ్య పద్మభూషణ్ అవార్డు రావడంతో మొదటిసారి ఈ అవార్డును గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ముందుగా తనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఈయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈయనకు పద్మ అవార్డు రావడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభినందనలు తెలియజేస్తున్నారు.. తండ్రి స్థాపించిన బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆస్పత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతోమందికి ఉచితవైద్యం అందేలా కృషి చేస్తున్నారు.. అటు రాజకీయాల్లో ఇటు సినిమాలు, సామాజిక సేవలు మరువలేనివి.. మన లెజెండరి హీరో బాలయ్య కు పద్మ భూషణ్ అవార్డు రావడం ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేవు.. తమ హీరో అవార్డును అందుకోవడం చూడాలని ఆశ పడుతున్నారు..


ఇక సినిమాల విషయానికొస్తే.. ఇక త్వరలోనే అఖండ 2 తో మన ముందుకు రానున్నారు. ఆయన రీసెంట్‌గా నటించిన డాకు మహారాజ్‌బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.. ఈ అఖండ 2 ను త్వరగా పూర్తి చేసి మరో సినిమాను లైన్లో పెట్టుకోవాలని బాలయ్య చూస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారు చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×