Thug Life: లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Hassan) సినిమాలు అంటేనే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ ఇప్పటికీ తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన చిత్రం “థగ్ లైఫ్”(Thugh Life). ఈ సినిమా జూన్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పాలి.
37 ఏళ్ల తర్వాత..
మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో “నాయకుడు” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అంటే దాదాపు 37 సంవత్సరాల తర్వాత మరోసారి ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం ఈ చిత్రం చేరుకోలేకపోయింది. ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులో కూడా కమల్ హాసన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈయన సినిమాలు ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటూ ఉంటాయి.
నైజాం థియేట్రికల్ హక్కులు…
ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి (Sudhkar Reddy)నైజాం థియేట్రికల్ రైట్స్ (Theatrical rights )కొనుగోలు చేశారు. సుధాకర్ రెడ్డి హీరో నితిన్ (Nithin) తండ్రి అనే విషయం మనకు తెలిసిందే ఈయన నేను అద్భుతమైన సినిమాలను నిర్మించడమే కాకుండా ఇలా ఇతర భాష సినిమాలను కొనుగోలు చేస్తూ తెలుగులో విడుదల చేస్తూ మంచి లాభాలను అందుకుంటు ఉన్నారు. అయితే ఇటీవల కమల్ హాసన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన విక్రమ్(Vikram) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా కమల్ సొంత నిర్మాణ సంస్థలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నైజం థియేట్రికల్ హక్కులను కూడా అప్పట్లో సుధాకర్ రెడ్డి కొనుగోలు చేశారు.
విక్రమ్ సినిమాకు ముందు కమల్ హాసన్ సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు కావడంతో ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు దీంతో సుధాకర్ రెడ్డి సాహసం చేసి విక్రమ్ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. అయితే ఊహించని విధంగా విక్రమ్ సినిమా తెలుగులో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకొని సుధాకర్ రెడ్డికి మంచి లాభాలను అందించాయి. ఇలా విక్రమ్ సినిమాకు మంచి లాభాలు రావడంతో తిరిగి థగ్ లైఫ్ నైజాం హక్కులను కూడా కొనుగోలు చేశారు కానీ, ఈ సినిమా మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో పూర్తిస్థాయిలో కలెక్షన్లు పడిపోయాయని, సుధాకర్ రెడ్డి కూడా భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. విక్రమ్ సినిమా లాభాలను అందిస్తే ఈ చిత్రం మాత్రం భారీగా నష్టాలను తీసుకువచ్చిందని చెప్పాలి