BigTV English

Trump Vs Musk : ఈ దోస్తుల మధ్య పుల్ల పెట్టింది ఎవరు? వీరి గొడవకు కారణం ఏంటి?

Trump Vs Musk : ఈ దోస్తుల మధ్య పుల్ల పెట్టింది ఎవరు? వీరి గొడవకు కారణం ఏంటి?

Trump Vs Musk : ట్రంప్, మస్క్. ఇద్దరూ ఇద్దరే. దూకుడు స్వభావం. తెంపరితనం. లెక్కచేయని తనం. తూటాల్లాంటి మాటలు. చిలిపి చేష్టలు. వ్యాపార వ్యూహాలు. ఇవే వారిద్దరినీ దగ్గర చేశాయి. కలిసి పని చేసేలా ఏకం చేశాయి. ఇన్నాళ్లూ వీళ్లిద్దరి మధ్య బ్రోమాన్స్ నడిచింది. ఇప్పుడు బ్రేకప్. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. నీ సెక్స్ బండారం బయటపెడతానంటూ ట్రంప్‌ను మస్క్ బెదిరించారు. నీ బిజినెస్‌ను దెబ్బ కొడతానంటూ ట్రంప్ రివర్స్‌లో వార్నింగ్ ఇచ్చారు. వాళ్లిద్దరి మధ్య వార్ పీక్స్‌కు చేరింది. ఇంతకీ అసలేమైంది? వాళ్లిద్దరికీ ఎక్కడ చెడింది?


వారి బంధం ధృఢమైనది..

ట్రంప్, మస్క్‌లు అనుకోకుండా క్లోజ్ అయ్యారు. 2024 జులైలో ఎన్నికల ప్రచారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ అటాక్ నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ట్రంప్‌కు మద్దతు ఇస్తూ మస్క్ ముందుకొచ్చారు. “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్”.. అంటూ ఆ ఇద్దరూ కలిసి రిపబ్లికన్ పార్టీని గెలుపు దిశగా నడిపించారు. మస్క్ రాజకీయ నేత కాకున్నా.. ట్రంప్ కోసం బిలియన్ డాటర్లు ఖర్చు చేశారు. గెలుపు వ్యూహాలు రచించారు. అవన్నీ వర్కవుట్ అయ్యాయి. ట్రంప్‌ను యూఎస్ ప్రెసిడెంట్‌ చేశాయి. వారి బంధం మరింత ధృఢమైంది. అధ్యక్ష పదవి చేపట్టగానే మస్క్‌ను “ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి” కేటగిరీలో సలహాదారుగా నియమించుకున్నారు. అతని కోసమే ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీసియన్సీ (DOGE) ను క్రియేట్ చేశారు. ప్రభుత్వ విభాగాల ఖర్చు తగ్గించడమే డోజ్ పని. ఆ సమయంలో మస్క్‌ను నెత్తిన పెట్టేసుకున్నారు ట్రంప్. “ప్రపంచం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప వ్యాపార నాయకులు, ఆవిష్కర్తలలో మస్క్ ఒకరు” అని తెగ పొగిడేశారు. ఇదంతా గతం. ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది.


వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్..

మే నెలలో తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లు.. “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. డోజ్‌లో ఉన్నప్పుడే మస్క్, ట్రంప్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. DOGEలో ఉన్న ట్రంప్ సన్నిహితులతో మస్క్ గొడవ పడ్డారట. ట్యాక్స్ బిల్లును గట్టిగా వ్యతిరేకించారు. ఫలితంగా 130 రోజుల తర్వాత పదవీ కాలం ముగియడంతో డోజ్ నుంచి బయటకు వచ్చేశారు మస్క్. ఆయన రాలేదు ట్రంపే వెళ్లగొట్టారని అంటారు. పదవి పోవడంతో మస్క్ నోటికి పని మొదలుపెట్టారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్.. డోజ్ ప్రయత్నాలను దారుణంగా దెబ్బతీస్తుందని అన్నారు. “ఈ భారీ, దారుణమైన, పంది మాంసంతో నిండిన కాంగ్రెస్ ఖర్చు బిల్లు అసహ్యకరమైనది” అంటూ జూన్ 3న మస్క్.. ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ట్యాక్స్ బిల్లులో మస్క్ వ్యాపారాలను దెబ్బతీసే విధానాలు ఉండటమే అందుకు కారణం అంటున్నారు. విద్యుత్ కార్లకు ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చేందుకు ట్రంప్ నిరాకరించడంతో.. మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీకి భారీ నష్టాలు తప్పవు. అందుకే ఆ బిల్లుపై ఎలాన్ ఇంతటి రచ్చ చేస్తున్నారని అంటున్నారు.

మస్క్‌కు భారీ నష్టం..

తన సపోర్ట్ లేకుండా 2024 ఎన్నికల్లో ట్రంప్ కానీ, రిపబ్లికన్ పార్టీ నేతలు కానీ గెలిచేవారు కాదంటూ ఎలాన్ మస్క్ మరింత దూకుడు పెంచారు. ట్రంప్ సైతం తగ్గేదేలే అంటూ.. మస్క్ లేకున్నా తాను పెన్సిల్వేనియాలో గెలిచేవాడినని తేల్చి చెప్పారు. అదే సమయంలో మస్క్ వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు కట్ చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ట్రంప్. అంతే.. దెబ్బకు టెస్లా షేర్లు ఢమాల్. దాదాపు 14 శాతం మేర టెస్లా మార్కెట్ వ్యాల్యూ పడిపోయింది. 152 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది.

సెక్క్ స్కాండల్‌లో ట్రంప్?

తన ఆర్థిక ప్రయోజనాలపై ట్రంప్ దెబ్బ కొట్టడంతో మస్క్ మరింత హర్ట్ అయ్యారు. ఈసారి ట్రంప్‌ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేలా సంచలన కామెంట్లు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్ట్రైన్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయంటూ మరింత రచ్చ రాజేశారు. ట్రంప్ పేరు ఎప్‌స్ట్రైన్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌లో ఉందని.. ఆ వివరాలు బయటపెట్టకుండా అధ్యక్షుడు ట్రంప్ అడ్డుకుంటున్నారంటూ కాంట్రవర్సీ ట్వీట్ చేశారు మస్క్. “80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా..” అంటూ ట్రంప్‌ను మరింత కవ్వించేలా.. తాను కొత్త పార్టీ పెడతానంటూ బెదిరించేలా.. ఎక్స్‌లో పోల్ కూడా పెట్టారు మస్క్. అతను పిచ్చివాడిగా మారిపోయాడు అంటూ ట్రంప్ బదులిచ్చారు.

Also Read : అమెరికాను కుదిపేస్తున్న ఎప్‌స్ట్రీన్ వివాదం.. కంప్లీట్ డీటైల్స్

ఎవరీ జెఫ్రీ ఎప్‌స్ట్రీన్? ఏంటి ఆ ఫైల్స్?

న్యూయార్క్‌కు చెందిన జెఫ్రీ ఎప్‌స్ట్రీన్.. సెక్స్ స్కాండల్ మాఫియా డాన్. అమెరికాలోని హైప్రొఫైల్ వ్యక్తులకు అమ్మాయిలను సరఫరా చేసేవాడు. ఆయనకు సొంతంగా ఓ ప్రైవేట్ దీవి, ప్రైవేట్ జెట్ ఉండేది. దేశంలోని పలువురు అత్యంత సంపన్నులు, పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్స్‌ను తన విమానంలో తీసుకొచ్చి.. తన ఐలాండ్‌లో ఉంచి.. అమ్మాయిలను పంపించడం అతని బిజినెస్. జెఫ్రీ కస్టమర్ల లిస్ట్‌లో ట్రంప్, క్లింటన్ లాంటి వాళ్లు కూడా ఉన్నారనేది ఆరోపణ. ఓ కేసులో జెఫ్రీ ఎప్‌స్ట్రీన్ అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. కానీ, అతని కేసు ఫైల్స్ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. వాటిని కావాలనే ట్రంప్ ఆపుతున్నారని ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్నారు. ఉలిక్కిపడిన ట్రంప్ తనకూ ఆ ఫైల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని.. తానేమీ ఆ విమానంలో తిరగలేదని, ఆ ఐలాండ్‌కు వెళ్లలేదని వివరణ ఇచ్చుకుంటున్నారు. ఆ నిజం బయటపడితే.. అమెరికా రాజకీయాలు అమాంతం మారిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×