Tiger 3 Movie : అడ్వాన్స్ బుకింగ్స్ తో దంచి కొడుతున్న సల్మాన్ మూవీ..

Tiger 3 Movie : అడ్వాన్స్ బుకింగ్స్ తో దంచి కొడుతున్న సల్మాన్ మూవీ..

tiger 3 advance booking
Share this post with your friends

Tiger 3 Advance Booking

Tiger 3 Movie : బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ టైగర్ సీక్వెల్ గా రాబోతున్న మూవీ టైగర్ 3. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్ లో క్రేజీగా వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ స్పై చిత్రం విడుదలకు ముందే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ కూడా కాకముందే ఈ మూవీ ఊహించని అడ్వాన్స్ బుకింగ్ తో దూసుకుపోతోంది. 

స్పై మూవీ అంటేనే బయట దేశాల్లో ఎంతో కొంత షూటింగ్ ఉంటుంది.. మరి టైగర్ మూవీ అంటే భారీ బడ్జెట్ కామనే కదా. ఇంతకుముందు చిత్రాలకు మించి ఈ మూవీ షూటింగ్ పలు దేశాలలో చిత్రీకరించడం జరిగింది. క్వాలిటీ దగ్గర నుంచి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ వరకు మేకర్స్ ఎక్కడ తగ్గకపోవడంతో మూవీ బడ్జెట్ భారీగానే అయింది. షూటింగ్, సినిమా రెమ్యూనరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలిపి ఈ చిత్రం బడ్జెట్ సుమారు 300 కోట్లు ఉండవచ్చని అంచనా.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి.అమెరికా, కెనడా తో కలిపి సుమారు నాలుగు కోట్లు వసూళ్లు కాగా..యూఏఈ, మిడిల్ ఈస్ట్, యూకేలో కూడా భారీ వస్తువులు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టైగర్ 3 సినిమా 1.2 మిలియన్ డాలర్స్ వసూలు రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో ఇప్పటి వరకు ఈ మూవీ 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 

ఇక టికెట్ల అమ్మకాల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 225000 టికెట్లను మల్టీ‌ప్లెక్స్‌లో అమ్ముడుపోయాయి. సెకండ్ డే కి కూడా 1 లక్ష టికెట్ల వరకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు టైగర్ 3 మూవీ సల్మాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది అని టాక్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలక్షన్స్ 40 కోట్ల వరకు వసూలు అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా. విడుదలయ్యాక పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Tollywood : టాలీవుడ్ లో ఉగాది సందడి.. చిరు, బాలయ్య పోస్టర్లు వైరల్..

Bigtv Digital

Maa Oori Polimera 2 Trailer: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘పొలిమేర 2’ ట్రైలర్.. ఈసారి డోస్ పెంచారుగా..

Bigtv Digital

Chiranjeevi’s gift to Balayya director : బాల‌య్య డైరెక్ట‌ర్‌కి చిరంజీవి గిఫ్ట్‌

Bigtv Digital

Chandrika Ravi : బాల‌య్య‌ను గుండెల్లో పెట్టుకుంటాన‌న్న న‌టి

Bigtv Digital

Nagarjuna : తెలుగు సినిమాల్లో నిజమైన కౌబాయ్ కృష్ణగారే : నాగార్జున

BigTv Desk

Disha Patani: సూర్య 42… సెట్స్‌లో దిశా ప‌టాని సంద‌డి

BigTv Desk

Leave a Comment