BigTV English

Sreeleela in ‘Tillu Square’: ‘టిల్లు స్క్వేర్’ కోసం ముందుగా శ్రీలీల.. సిద్ధు జొన్నలగడ్డతో రోమాన్స్ ఇష్టం లేకే!

Sreeleela in ‘Tillu Square’: ‘టిల్లు స్క్వేర్’ కోసం ముందుగా శ్రీలీల.. సిద్ధు జొన్నలగడ్డతో రోమాన్స్ ఇష్టం లేకే!

Sreeleela Rejected the Siddu jonnalagadda’s ‘Tillu Square’ Movie: ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాసంపాదించుకున్న నటీమణులలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరస అవకాశాలతో తిరిగి వెనక్కి చూసుకోలేదు. తన అందం, అభినయంతో పాటు ముఖ్యంగా డ్యాన్స్‌తో కుర్రకారును బుట్టలో వేసుకుంది.


అయితే గతేడాది ఏకంగా ఏడెనిమిది సినిమాలకు సంతకం చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ సినిమాలేవి శ్రీలీలకు పెద్దగా పేరును తీసుకురాలేదు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గుంటూరు కారం మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ సినిమా కూడా ఆమెకు నిరాశే మిగిల్చింది.

ఇక ఈ సినిమా ప్లాప్ కావడంతో శ్రీలీల మళ్లీ కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. డిఫరెంట్‌ స్టోరీతో పాటు అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భామ తను నటించే పాత్రలపై కొన్ని నియమాలు పెట్టుకుంది. ఎక్కువగా రొమాంటిక్ సీన్లు ఉన్న పాత్రలకి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.


Read More: వామ్మో.. శ్రీలీల ధరించిన ఈ చీర అంత రేటా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

అయితే ఈ ముద్దుగుమ్మ మిస్ చేసుకున్న ఓ మూవీ గురించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ కోసం ముందుగా శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే కొన్ని సీన్లను కూడా ఆమెపై చిత్రీకరించారు. ఆ తర్వాత తాను ఈ సినిమాను కొనసాగించలేనని తప్పుకుందట.

దీంతో ఆమె ప్లేస్‌లోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. అయితే శ్రీలీల ఈ మూవీకి నో చెప్పడం వెనుకున్న అసలు కారణం ఏంటో ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తేనే అందరికీ అర్థమైపోయింది. ఈ ట్రైలర్‌లో చాలా లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: శ్రీలీల వద్దు బాబోయ్.. భగ్గుమంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ట్రైలర్‌లోనే ఇంత ఘాటుగా ఉంటే.. ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే శ్రీలీల ఈ మూవీ చేయడానికి ఇష్టపెట్టుకోలేదని గుస గుసలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×