BigTV English

Amazon Forest : అమెజాన్ అడవులు ఇక మాయం!

Amazon Forest : అమెజాన్ అడవులు ఇక మాయం!
Amazon Forest

Amazon Rain Forest : ‘లంగ్స్ ఆఫ్ ది వరల్డ్’‌గా పేరొందిన అమెజాన్ అడవులకు ముప్పు వచ్చి పడింది. 2050 నాటికి ఆ అడవుల్లో సగం అంతరించిపోయే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అధిక ఉష్ణోగ్రతలు, కరువు, నరికివేత, కార్చిచ్చుల కారణంగా అడవులు అంతర్థానం అవుతాయని పేర్కొంది.


అమెజాన్‌ అటవీ విస్తీర్ణం 38% మేర తగ్గిపోయే ఉందని పరిశోధకులు చెప్పారు. 2050 నాటికి 10-47% విస్తీర్ణం మేర ముప్పు తప్పదని హెచ్చరించారు. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నా.. 65 మిలియన్ల సంవత్సరాలుగా అమెజాన్ అడవులు చెక్కుచెదరలేదు. అయితే తేమ శాతం ఇంకా క్షీణిస్తూ ఉండే పక్షంలో బంజరుగా మారిపోవడం తథ్యమని చెబుతున్నారు.

ఇప్పటి వరకు అటవీ విస్తీర్ణంలో రష్యా దేశమే టాప్. ప్రపంచం మొత్తం అడవుల్లో ఐదోవంతు వాటా ఆ దేశానిదే. ఇది 81 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సమానం. బ్రెజిల్(12.3%), కెనడా(8.6%), అమెరికా(7.7%), చైనా(5.5%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఇండియా వాటా కేవలం 1.8 శాతమే. దేశంలో మొత్తం 7.24 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పరుచుకుంది.

Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×