Big Stories

Human Brain: రోజురోజుకు పెరుగుతున్న మనిషి మెదడు సైజు..!

 

- Advertisement -

human

- Advertisement -

Day by Day Human Brain Size Increasing: మనిషి ప్రతిభ అనేది మెదడు సైజు పైనే ఆధాపడి ఉంటుందని నిపుణులు చెబుతారు. మనిషి మెదడు సైజు ఎక్కువగా ఉన్నవారికి ప్రతిభ ఎక్కువ వుంటుందని పేర్కొంటున్నారు. అయితే ఆల్కహాల్స్, స్మోకింగ్స్, శీతలపానీయాలు సేవించడం వల్లన మెదడు సైజు తగ్గుతున్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. అదిలా ఉంటే తాజాగా మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లిడించారు.

కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డెవిస్ హెల్త్ కి చెందిన పరిశోధకులు మానవ మెదడుపై చేసిన అధ్యయనంలో కీలక విషయాలను గుర్తించారు. వాటిని జామా న్యూరాలజీ అనే జనరల్ లో ప్రచురించారు. ఇక అమెరికా పరిశోధకులు వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం 1930 లో పుట్టిన వారిలో పోలిస్తే 1070 లో పుట్టిన వారి మెదడు సైజు 6.6 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఇక 1999 నుంచి 2019 మధ్య కాలంలో 3226 మంది మెదడును ఎంఆర్ఐ తీసి అధ్యయనం చేయగా 1930 లో పుట్టన వారి మెదడు సగటు 1234 మిల్లీమీటర్లు ఉండగా 1970 లో పుట్టిన వారి మెదడు 1326 మిల్లీమీటర్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే మెదడులో రెండు భాగాలు పెరిగినట్లు చెప్పారు. దాని నిర్మాణంలో భాగమైన వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పోక్యాంపస్ సైజు కూడా పెరిగినట్లు అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.

Also Read: దారుణం.. లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

ఇలా మెదడు సైజు పెరగడం వల్లన ప్రయోజనాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. వయసు పెరిగే దారిలో మతిమరుపు, చిత్త వైకల్యం ముప్పు తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. ఇక ఇదే సమయంలో మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని మానసిక ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలో వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News