BigTV English

Siddharth- AditiRao Hydari: పెళ్లి కాదంట.. ఫోటో రిలీజ్ చేసిన సిద్దార్థ్- అదితి

Siddharth- AditiRao Hydari: పెళ్లి కాదంట.. ఫోటో రిలీజ్ చేసిన సిద్దార్థ్- అదితి


Siddharth- AditiRao Hydari:  ఎట్టకేలకు హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ నిశ్చితార్థంతో  ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా లివింగ్ రిలేషన్ లో ఉన్న ఈ జంట నిన్న.. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఎంతో సింపుల్ గా జరిగిన వీరి నిశ్చితార్థంలో కేవలం వారి దగ్గర బంధువులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ గుడి పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి ఈ వేడుక చేసుకున్నారని తెలుస్తోంది. దీనిపై పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తాజాగా అదితి తన సోషల్ మీడియాలో నిశ్చితార్థం తరువాత దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. సిద్దార్థ్ తో కలిసి ఉన్న ఈ ఫొటోలో వారి చేతులకు నిశ్చితార్థం ఉంగరాలు కనిపిస్తున్నాయి. దీంతో వీరు అధికారికంగా భార్యాభర్తలు అయ్యినట్లు చెప్పుకొచ్చారు. అదితి .. అతను  ఎస్ చెప్పాడు.. ఎంగేజ్డ్ అని రాసుకురాగా సిద్దూ సైతం ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్ అని రాసుకొచ్చాడు.  ఇక ఈ ఫొటోలో జంట ఎంతో అందంగా కనిపించారు.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


సిద్దార్థ్- అదితి కలిసి మహాసముద్రం అనే సినిమా చేశారు. ఆ సినిమా సెట్ లో వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ఇకపోతే ఇప్పటికే సిద్దుకు పెళ్లి అయ్యి ఒక బాబు ఉన్నాడు. అదితికి కూడా ఇది రెండో వివాహం. మరి ఈ జంట జీవితాంతం ఇలానే ఉంటారా.. ? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×