Tollywood..సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే పైన కనిపిస్తున్న ఫోటోలోని ఒక చిన్నారి ఆర్మీ జవాన్ దగ్గర చాలా క్యూట్గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. నాటి కాలం స్కూటీలో సరదాగా.. తన తండ్రితో కలిసి చెక్కర్లు కొట్టడానికి బయలుదేరుతున్నట్టు కనిపించిన ఈ చిన్నారి.. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. స్టార్ హీరోల అందరి సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే ఒక నిర్మాతను వివాహం చేసుకొని సెటిలైపోయింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పటికే ఆమె ఎవరో గుర్తుపట్టి ఉంటారు కదా.. అవునండి మీరు ఊహించినది నిజమే.. ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
పైన ఫోటోలో స్కూటీ మీద ఆర్మీ జవాన్ దగ్గర ఉన్న ఈ చిన్నారి మన రకుల్ ప్రీత్ సింగ్.ఆ ఆర్మీ జవాన్ ఎవరో కాదు తన తండ్రి.. తన తండ్రితో కలిసి దిగి ఉన్న ఫోటోని తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేస్తూ.. కొటేషన్ కూడా పంచుకుంది.. ఇక ఆ ఫోటో కింద క్యాప్షన్లో..” సాయుధ దళాల దినోత్సవం అంతర్జాతీయంగా ఉండవచ్చు, కానీ నా హృదయం మా నాన్న యూనిఫాం కోసం కొట్టుకుంటుంది. ఒక ఆర్మీ అధికారి.. తల్లిదండ్రులుగా.. వారి సంరక్షణలో పెరగడం అంటే.. త్యాగం, గౌరవం, స్థితిస్థాపకతను ముందుగానే నేర్చుకోవడం. ఈ రోజు, నేను మా నాన్నను మాత్రమే కాకుండా, భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా.. తనకంటే సేవను మాత్రమే ముఖ్యమని భావించి.. ఆర్మీ ను ఎంచుకునే ప్రతి సైనికుడిని గౌరవిస్తాను.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో మన భారత సైన్యం ధైర్యం, శాంతి ఉచితం కాదని మనకు గుర్తు చేస్తుంది.. ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ కు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అంటూ రకుల్ ప్రీత్ సింగ్ రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం తన తండ్రితో కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ALSO READ : Betting Apps Promotion: శ్రీముఖి , ఆదిరెడ్డి గుట్టురట్టు చేసిన అన్వేష్.. ఖి’లేడీ’ అంటూ..!
రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్..
రకుల్ ప్రీత్ సింగ్ ‘గిల్లి’ అనే కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ అనే సినిమాతో అడుగుపెట్టిన ఈమె.. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ అనే సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.” ప్రార్ధన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ” అనే డైలాగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తర్వాత కాలంలో ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ (Ram Charan) వంటి హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్ కి వెళ్ళిపోయి, అక్కడే ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నాని (Jockey Bhagnani)ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అక్కడే పలు సినిమాలు చేస్తూ బిజీగా మారింది రకుల్ ప్రీత్ సింగ్.