Tollywood: ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తప్పవు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా అందరూ ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే కరెక్ట్ గా చెప్పలేం. కానీ అలా ఎదుర్కొన్న వారు మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి తాముపడ్డ బాధలను చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కూడా ఒక బ్యూటీ తన బాధను వెళ్ళబుచ్చుకుంది. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, తన నటనతో అందరిని అబ్బురపరిచిన ఈ చిన్నారి.. ఇప్పుడు పెద్దదైపోయింది. హీరోయిన్ రేంజ్ లో అందాలు వలకబోస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.అయితే ఆమె కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఆడిషన్స్ లో ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని చెప్పారట. దానివల్ల తాను బాడి షేమింగ్ కి గురయ్యానని, ఇబ్బంది పడ్డాను అంటూ తెలిపింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం
చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్న బ్యూటీ..
పృథ్వీ, రాశి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘దేవుళ్ళు’. తల్లిదండ్రుల ప్రేమ కోసం పిల్లలు పడే ఆరాటాన్ని తెరపై చూపిస్తూ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ నిత్యాశెట్టి (Nithya shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరినీ అబ్బురపరిచింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా ఈమెకు అంజి, చిన్ని చిన్ని ఆశ, మాయ, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలలో అవకాశాలు రాగా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే నంది అవార్డు అందుకున్న ఈమె.. ఇప్పుడు హీరోయిన్ గా అలాగే పలు సినిమాలలో కీలక పాత్రలు కూడా పోషిస్తుంది.
బాడీ షేమింగ్ తో నరకం చూసా – నిత్యాశెట్టి
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యాశెట్టి ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. నిత్యా శెట్టి మాట్లాడుతూ..” చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను నటించాను కదా.. ఇప్పుడు సినిమాల్లోకి వస్తే హీరోయిన్ గా పిలిచి అవకాశం ఇస్తారని అనుకున్నాను. కానీ రియాలిటీ వేరు. నేను చేసే ఇన్ఫోసిస్ జాబ్ మానేసి, మరి సినిమాల్లోకి వచ్చాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. అయితే ఒక అడిషన్ లో నా ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేశారు. ముక్కు సర్జరీ చేసుకొని వస్తే చాన్స్ ఇస్తామని కూడా తెలిపారు. ఇంకో కొంతమంది దేవుళ్ళు పాప కదా హీరోయిన్ గా సెట్ అవ్వదు అన్నారు. ఇంకొంతమంది ఏమో నల్లగా ఉన్నావు.. తెల్లగా లేవు మా సినిమాలో నీకు అవకాశం ఇవ్వలేము అని ఇలా ఎవరికి వారు వంకలు పెట్టారు. ఇక నాకు హీరోయిన్గా గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఒక పిట్ట కథ’ సినిమా ఆడిషన్స్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. డైరెక్టర్ నన్ను ఓకే చేసినా.. నిర్మాతలు మాత్రం చాలా లావుగా ఉన్నావన్నారు. అయితే నన్ను ఓకే చేసి షూటింగ్ కి వెళ్లేసరికి ఛాలెంజ్గా తీసుకొని 20 రోజుల్లోనే 6 కిలోల బరువు తగ్గి చూపించాను” అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. మొత్తానికైతే తనకి కూడా తిప్పలు తప్ప లేదని తెలిపింది నిత్యాశెట్టి.
ALSO READ:HBD Prince Cecil: 19 ఏళ్లకే ఇండస్ట్రీ ఎంట్రీ.. ఆ చిన్న తప్పే గుర్తింపు లేకుండా చేసిందా?