BigTV English

Viral News: వామ్మో ఇదేం ఇండియన్ బీచ్, నెట్టింట ఫారినర్ వీడియో వైరల్!

Viral News: వామ్మో ఇదేం ఇండియన్ బీచ్,  నెట్టింట ఫారినర్ వీడియో వైరల్!

Viral Video: విదేశాల్లో బీచ్ లు అంటే అమ్మాయిలు బికినీల్లో.. అబ్బాయిలు షార్ట్ మీద కనిపిస్తారు. టూపీస్ డ్రెస్సుల్లో హాయిగా సేదదీరుతారు. ఇండియాలో అలా ఉండదుగా, బీచ్ అయినా సరే నిండైన దుస్తుల్లోనే కనిపిస్తారు. తాజాగా ఓ ఫారిన్ ట్రావెలర్ ఇండియన్ బీచ్ చూసి షాకయ్యాడు. ఒక్కరు కూడా టాప్ లెస్ లో కనిపించడం లేదంటూ ఆశ్చర్యపోయాడు. ఇదే విషయాన్ని చెప్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


చొక్కా తీసేందుకు సిగ్గుపడ్డ జార్జ్

రీసెంట్ గా ఇండియాకు వచ్చిన ఫారిన్ ట్రావెల్ వ్లాగర్ జార్జ్ బక్లీ.. ఇండియాలోని ఓ బీచ్ కు వెళ్లాడు. అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అందరూ నిండైన దుస్తుల్లో కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. తాను షర్ట్ విడవాలా? వద్దా? అని ఆలోచించి, చివరకు చొక్కా తీసేసి బీచ్ అలల్లో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత చొక్కా లేకుండా ఉండటం మంచిది కాదని భావించి వెంటనే వేసుకున్నాడు. బక్లీ వీడియో కాసేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. ఇండియన్స్ దుస్తులు లేకుండా పబ్లిక్ గా బీచ్ లో ఎంజాయ్ చేయడాన్ని ఇష్టడపరని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, ఆయన వెళ్లిన బీచ్ ఎక్కడ ఉంది? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.


Read Also:  రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

జార్జ్ బక్లీ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు. మరికొంత మంది ఆయన వ్యాఖ్యలు ఇండియన్స్ ను ఎగతాళి చేసేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు.  “అవును బ్రో ఇది ఇండియా. మేం మా శరీరాన్ని బహిరంగంగా చూపించుకోము” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మా సంస్కృతి, సంప్రదాయాలు అలా ఉన్నాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉండవచ్చు. మాకు కాస్త సిగ్గు ఎక్కువ. మా శరీరాన్ని పబ్లిక్ గా చూపించేందుకు ఇష్టపడం. అయితే, నిండైన దుస్తులతో బీచ్ లో ఎంజాయ్ చేయడాన్ని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు  “విదేశాల్లో ఎలా ఉన్నా, ఇండియన్స్ ఇప్పటికీ బీచ్ లోనే పద్దతి గానే ఉంటారు. ఇతర దేశ ప్రజలతో పోల్చితే సిగ్గు కాస్త ఎక్కువగానే ఉంటుంది. “మీకు సూటయ్యే బీచ్ లు బహుశ ఇండియాలో లేకపోవచ్చు” అని మరికొంత మంది నెటిజన్లు రాసుకొచ్చారు. “గోవా లాంటి బీచ్ లకు వెళ్తే, మీరు కాస్త ఎంజాయ్ చెయ్యొచ్చు” అని ఇంకొంత మంది కామెంట్ చేశారు. మొత్తంగా జార్జ్ బక్లీ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు, పెద్ద చర్చకు కారణం అయ్యింది.  దేశ, విదేశాల బీచ్  ల గురించి పోలికలు, లోటుపాట్ల గురించి కామెంట్స్ వరద పారాయి.

Read Also: గాలి దుమారంలో విమానం, వణికిపోయిన ప్రయాణీకులు, నెట్టింట వీడియో వైరల్!

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×