BigTV English

Tollywood: బిగ్ బాస్ ఫేం ఆదిత్య ఓం, మంచు లక్ష్మీ కలిసి నటించిన మూవీ… థియేటర్స్‌లోకి ఎప్పుడంటే..?

Tollywood: బిగ్ బాస్ ఫేం ఆదిత్య ఓం, మంచు లక్ష్మీ కలిసి నటించిన మూవీ… థియేటర్స్‌లోకి ఎప్పుడంటే..?

Tollywood..టాలీవుడ్ చలన చరిత్ర పరిశ్రమలో ఎన్నో బడా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఆ కుటుంబాల నుంచి అబ్బాయిలు మాత్రమే హీరోలుగా సెటిల్ అయిన విషయం తెలిసిందే . కానీ అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించడం చాలా కష్టంగా మారిందని చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారిలో మెగా డాటర్ నిహారిక (Niharika)తో పాటు మంచు డాటర్ మంచు లక్ష్మి(Manchu Lakshmi)కూడా ఒకరు అని చెప్పాలి. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. అయితే ఏ సినిమా కూడా ఈమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపును అందివ్వలేదని చెప్పడంలో సందేహం లేదు. అటు నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


ఆదిపర్వంతో రాబోతున్న మంచు లక్ష్మి..

ఇకపోతే అనగనగా ఓ ధీరుడు సినిమాలో హీరోయిన్ గా కంటే విలన్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో నంది పురస్కారం కూడా అందుకుంది. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో పురస్కారాలు అందుకుంటున్న ఈమె తాజాగా ఆదిపర్వం (Adhiparvam)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆదిపర్వం. ఇందులో బిగ్ బాస్ (Bigg Boss 8) ఫేమ్, ప్రముఖ నటుడు ఆదిత్య ఓం(Adhitya Om)కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ పతాకం పై ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి (Sanjeev megoti) దర్శకత్వం వహిస్తున్నారు.


అక్టోబర్ 31న విడుదల..

ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమ కథగా, గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 31వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దాదాపు 500 కు పైగా థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే దీపావళి పండుగను బేస్ చేసుకుని ఎనిమిది మంది హీరోలు సక్సెస్ కోసం ఆరాటపడుతున్న సమయంలో ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఆదిపర్వం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలే మంచి పేరున్న హీరోలతో పోటీ అంటే మరి ఈమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

దుష్టశక్తికి – దైవశక్తికి మధ్య జరిగే యుద్ధం..

ఆదిపర్వం 1974 – 1990 మధ్యకాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారట డైరెక్టర్ సంజీవ్ మేగోటి. అరుంధతి, అమ్మోరు చిత్రాల తరహాలోనే దుష్టశక్తికి – దైవ శక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో , టెక్నికల్ హంగులతో చూపించబోతున్నట్లు సమాచారం .ఇక ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే విధంగా ఆదిపర్వం ఉండబోతుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు
..మరి ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఆదిపర్వం నటీనటులు..

ఇక నటీనటుల విషయానికి వస్తే మంచు లక్ష్మి, ఎస్తేర్, ఆదిత్య ఓం , సుహాసిని , శ్రీజిత ఘోష్ , శివ కంఠమనేని, జెమిని సురేష్, వెంకట్ కిరణ్ ,సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, ఢిల్లీ రాజేశ్వరి, జబర్దస్త్ గడ్డం నవీన్, మధు నంబియార్, స్నేహ అజిత్ , శ్రావణి, రామకృష్ణ , దుగ్గిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీరామ్, లీలావతి , రవి రెడ్డి, జ్యోతి, బృంద, బి ఎన్ శర్మ , ఆయేషా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×