Pushpa 2 Stampede : కొన్ని సినిమాలను కొన్ని ప్లేసులలో చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలానే తమ అభిమాన హీరో సినిమా : విడుదలైతే ఎంత రేటు అయినా పెట్టుకుని ఆ సినిమాలకి వెళుతూ ఉంటారు కొంతమంది ప్రేక్షకులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంధ్య థియేటర్లో సినిమా చూడటం అనేది చాలామందికి ఒక రకమైన కొత్త అనుభూతి అని చెప్పాలి. చాలామంది సినిమా ప్రేమికులు, ప్రేక్షకులు సంధ్య థియేటర్లో సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలామంది సినిమా ప్రముఖులు కూడా తమ సినిమా విడుదల రోజు ఖైరతాబాద్ లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్ లో ఒకసారి కనిపించి సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గర దర్శనమిస్తూ ఉంటారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే సంధ్య థియేటర్ దగ్గర క్రౌడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
కేవలం కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకు మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, మహేష్ బాబు నటించిన పోకిరి వంటి సినిమాలు రీ రిలీజ్ కి కూడా విపరీతమైన క్రౌడ్ హాజరైంది. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ కి లో అయితే ఒక పెద్ద సినిమాకి టికెట్లు కూడా తీసుకోకుండా చాలామంది థియేటర్ కి ఎంట్రీ ఇస్తారు. అక్కడ థియేటర్ కెపాసిటీ ఉదాహరణకు 800 మందికి మాత్రమే ఉంటే 1500 మంది వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కూడా చాలామందికి టికెట్లు విపరీతమైన రేట్లు అమ్మింది. సంధ్య థియేటర్లో చాలామంది టికెట్స్ అడిగితే… టికెట్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ తీసుకున్నాడు అంటూ యాజమాన్యం చెప్పినట్లు ఇదివరకే బిగ్ టీవీ వెబ్సైట్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.
Also Read : Allu Arjun : కాసేపట్లో వీడియో బైట్ రిలీజ్ చేయనున్న అల్లు అర్జున్, త్వరలోనే బాధితుల ఫ్యామిలీ ను కలిసి అవకాశం
ఇకపోతే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన చాలా బాధాకరమైనది. తమ అభిమాన హీరో సినిమా చూడడానికి వచ్చిన ఒక ఫ్యామిలీకి ఊహించని విషాదం ఎదురయింది. రేవతి అనే ఒక ఆమె తన భర్త బిడ్డతో పాటు పుష్ప 2 సినిమా చూడటానికి సంధ్య థియేటర్ కి వెళ్ళింది. అక్కడికి అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది. ఈ తరుణంలో రేవతి అనే ఆమె మృతి చెందింది. వాళ్ల కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. అయితే రేవతి సంధ్య థియేటర్లో ఇబ్బంది పడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తాను చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు తన భర్తతో ఫోన్ మాట్లాడుతున్నట్లు, అలానే అల్లు అర్జున్ కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది దరిదాపుల్లో ఆమె ఉన్నట్లు ఆ వీడియోలో గమనించవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వీడియో తన పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది.