Tollywood:సాధారణంగా మిగతా వారితో పోల్చుకుంటే హీరోయిన్స్ నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉన్న కారణంగా.. ఎప్పుడూ సినిమా షూటింగ్స్ నిమిత్తం అవసరమైన ప్రదేశాలకు వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ ఉంటారు. అలాగే షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికినా చాలు.. వెకేషన్స్ కోసం నిత్యం ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక టాలీవుడ్ నటి ఎయిర్పోర్టులో అరుస్తూ కేకలు వేస్తూ.. అసహనం వ్యక్తం చేసింది. అసలు ఆమె ఎవరు? అసలేమైంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఇకపోతే హీరోయిన్లు సినిమా షూటింగ్స్ నిమిత్తం లేదా ఏదైనా సినిమా ఈవెంట్స్ కోసం విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. అందుకే చాలామంది ఎయిర్పోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎయిర్పోర్ట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం లేదా అసౌకర్యం కలగడం లాంటివి సెలబ్రిటీలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటనల గురించి సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ కూడా ఎయిర్పోర్టులో అరుస్తూ కనిపించింది. ఆమె ఎవరో కాదు మన్నారా చోప్రా (Mannara Chopra ).తెలుగులో ఎంతోమంది యంగ్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. ఈమె గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కి కజిన్ సిస్టర్ కూడా..
28°C Trailer: ఐదేళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు.. నవీన్ చంద్ర మూవీ ట్రైలర్ రిలీజ్.!
ఇక మన్నారు చోప్రా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, పంజాబీ సినిమాలలో నటించింది. తెలుగులో ‘ప్రేమ గీమా జాంతానై’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత సునీల్ (Sunil )’జక్కన్న’, సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) ‘తిక్క’ సినిమాలలో నటించింది. అంతేకాదు సీత, రోగ్ వంటి చిత్రాలతో పాటు ‘తిరగబడరా సామి’ అనే సినిమాలో కూడా నటించింది. హైదరాబాదు నుంచి ముంబైకి వెళుతుండగా.. అక్కడ ఊహించని ఘటన ఎదురయింది. తనను విమానం ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారు. నేను ముంబై ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పటికీ జైపూర్ కి వెళ్లే విమానంలో నన్ను ఎక్కనివ్వలేదు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నాపై దురుసుగా ప్రవర్తించారు. నేను ఇక్కడే ఉన్నా కూడా వారు నా పేరు పిలవలేదు. నేను ఇక్కడ బోర్డింగ్ గేట్ ముందే కూర్చున్నాను. అయినా సరే పిలవలేదు. దాంతో నేను విమానం ఎక్కలేకపోయాను. నేను వెళ్లి అడిగితే చాలా దురుసుగా నాతో ప్రవర్తించారు. ఢిల్లీ విమానాశ్రయంలో అదే విమాన సంస్థతో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాను అంటూ తన వీడియోలో చెప్పుకు వచ్చింది మన్నారా చోప్రా.
ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా ఒక హీరోయిన్ కి విమానాశ్రయంలో ఇలాంటి ఘటన ఊహించరానిది అని నటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎయిర్లైన్స్ వారు దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కూడా మన్నారా చోప్రా కు మద్దతుగా నిలుస్తూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
?utm_source=ig_web_copy_link