Pahalgam Terror Attack : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి సెగ టాలీవుడ్ కి కూడా తగులుతోంది. ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడే పరిస్థితి కన్పిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అన్ని భాషల సినీ ప్రముఖులు ఈ దాడిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మూవీపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం అందులో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ (Imanvi). కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాక్ నటీనటులను ఇండియాలో బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
ప్రభాస్ సినిమాకు పహల్గాం ఉగ్రదాడి సెగ
పహల్గాం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉగ్రవాదుల అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నారు. ఓవైపు చనిపోయిన వారి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూనే, మరోవైపు పాక్ పై మండిపడుతున్నారు. అందులో భాగంగా పాక్ నటీనటులను ఇక్కడ బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ ‘ఫౌజీ’ (Fauji)లో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్విని బ్యాన్ చేయాలనే డిమాండ్ మొదలైంది.
ఇమాన్వి బ్యాగ్రౌండ్ ఇదే
ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని ఇమాన్వి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. చాలామంది ఈ హీరోయిన్ పేరు ప్రకటించగానే అసలు ఆమె ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అందరికీ తెలిసింది ఒక్కటే ఇమాన్వి ఇన్స్టా లో ఫేమస్. అయితే ఇంకాస్త ముందుకెళ్తే ఆమె పాక్ కు చెందిన అమ్మాయి అనే షాకింగ్ విషయం తెలిసింది.
తాజాగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ గురించి బయట పెడుతూ, ఆమెను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. సమాచారం ప్రకారం ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఆమె ఫ్యామిలీ పాక్ లోని కరాచీలో నివసించేది. అలాగే ఇమాన్వి ఒక పాకిస్థాన్ మాజీ మిలిటరీ ఆఫీసర్ కూతురు. అయితే ఆమె చిన్న వయసులోనే భారతదేశానికి వలస వచ్చి, ఢిల్లీలో స్థిరపడింది. ‘ఫౌజీ’లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసే ముందు ఆమె యాక్టర్, డాన్సర్, కొరియోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్ గా మారి, సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.
పహల్గాం నేపథ్యంలో మతంతో సంబంధం లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా పరిచయమవుతున్న పాకిస్థానీ చెత్త ఇమాన్వీని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ మొదలైంది. మరి దీనిపై ఈ హీరోయిన్ ఎలా స్పందిస్తుంది? మరి ఇప్పుడు మేకర్స్ ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : పెళ్ళాం పిల్లలతో విదేశాలకు చెక్కేస్తున్న సైఫ్… ఇండియాకు గుడ్ బై చెప్పడానికి కారణం ఇదేనా?
పహల్గాం ఉగ్రదాడి
కాగా కశ్మీర్లో ఉన్న పహల్గాంను మినీ స్విజ్జర్లాండ్ అని పిలుచుకుంటారు. దానికి సమీపంలో ఉన్న బైసరన్ లోయలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడిన విషయం సంచలనంగా మారింది. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరరులు పర్యాటకులను చుట్టుముట్టి అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. ఇక ఘటన తర్వాత ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోగా, భద్రత బలగాలు వాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే టెర్రరిస్టుల ఊహాచిత్రాలను రిలీజ్ చేయగా, వారిలో ముగ్గురిని గుర్తించారు.
Pakistani actress Iman Esmail to debut Telugu film Fauji with Prabhas.
I request all Telugu friends, regardless of their ideology, to not allow Pakistani garbages in the Telugu industry. pic.twitter.com/WTTAc3FUiD
— Anshul Pandey (@Anshulspiritual) April 23, 2025