BigTV English

JEE Advanced 2025 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు, టాపర్‌గా నిలిచిన రజిత్‌గుప్తా

JEE Advanced 2025 Results:  జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు,  టాపర్‌గా నిలిచిన రజిత్‌గుప్తా

JEE Advanced 2025 Results: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్‌లో విద్యార్థులు ప్రవేశానికి జరిగిన JEE అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గతేడాది పోల్చితే ఈసారి ఉత్తీర్ణత 12.7 శాతం పెరిగింది. ఈ ఫలితాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -కాన్పూర్ ఐఐటీ వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు సాధించిన స్కోర్‌ను సంబంధిత వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


స్కోర్‌కార్డ్‌లతో పాటు, పేపర్ 1, పేపర్ 2 రెండింటికి సంబంధించి తుది సమాధానం కీ విడుదల చేసింది. ఢిల్లీ జోన్‌కు సంబంధించి రజిత్ గుప్తా అగ్రస్థానంలో నిలిచాడు.  కామన్ ర్యాంక్ లిస్ట్‌లో అతడికి 360 మార్కులకు 332 మార్కులు వచ్చాయి.  సాక్షమ్ జిందాల్ కూడా 332 మార్కులు సమానంగా సాధించాడు.

మే 18న జరిగిన JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష జరిగింది. మొత్తం 1,87,223 మంది అభ్యర్థుల్లో కేవలం 1,80,442 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో 54,378 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో 44,974 మంది పురుషులు కాగా, 9,404 మంది మహిళలు ఉన్నారు.


మొత్తం అభ్యర్థులలో 1,43,810 మంది పురుషులు ఉన్నారు. 43,413 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. హాజరైన వారిలో 1,39,085 మంది పురుషులు ఉండగా, 41,337 మంది మహిళా అభ్యర్థులున్నారు. IIT ఖరగ్‌పూర్ జోన్‌కు చెందిన దేవదత్త మాఝి 360 మార్కులకు 312 మార్కులు సాధించి ఆల్ ఇండియా మహిళా టాపర్‌గా నిలిచింది.

ALSO READ: శర్మిష్టా పనోలిని విడుదల చేయాలంటూ డిమాండ్

ఐఐటీ కాన్పూర్ జోన్ నుంచి 5,295 మంది ఉత్తీర్ణత సాధించారు. ఐఐటీ గౌహతి జోన్ నుంచి 2,743 క్వాలిఫై అయ్యారు. ఢిల్లీ జోన్ నుంచి 11,370 మంది విజయం సాధించారు. బాంబే జోన్ నుంచి 11,226 మంది అర్హత సాధించినవారిలో ఉన్నారు.

హోమ్‌ పేజ్‌లో కనిపించే ఫలితాల లింక్‌పై తొలుత క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ వివరాలు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలి. స్క్రీన్‌పై స్కోర్ ‌కార్డ్ చూపిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేకుంటే ప్రింట్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష రెండు విడతలుగా నిర్వహించారు. ఒక్కో షిఫ్ట్‌కు పేపర్- 1, పేపర్-2 ఉంటాయి. విద్యార్థులు, నిపుణుల అభిప్రాయాల మేరకు మేథ్స్ పేపర్ అత్యంత క్లిష్టంగా ఉన్నట్లు తెలిపారు. భౌతిక శాస్త్రం-రసాయన శాస్త్రం ప్రశ్నలు ఈజీగా ఉన్నట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా JEE అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన 54 వేల పైచిలుకు విద్యార్థులు IITలు, NITలు, IIIT ల్లో చదువుకోనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్, కోర్సుల ఎంపిక ప్రక్రియ జూన్ 3 నుంచి ప్రారంభంకానుంది. పూర్తి షెడ్యూల్ కోసం విద్యార్థులు అధికారిక JoSAA వెబ్‌సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది.

దేశంలోని 23 IIT ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు విడతలుగా పరీక్ష జరుగుతుంది. తొలిదశ జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించినవారు అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ విభాగాల్లో విద్యార్థులు తమ టాలెంట్ చూపాలి. అయితే రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. కేవలం IITలకు మాత్రమే కాకుండా IISc-బెంగళూరు, IISERలు, IIST, RGIPT వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని కొంతమంది ప్రత్యేక కోర్సులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్‌ను పరిగణిస్తారు.

Related News

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×