BigTV English
Advertisement

OTT Movie : వేటగాడిని వేటాడే పోలీసులు… దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చే వేటగాడి పెళ్ళాం

OTT Movie : వేటగాడిని వేటాడే పోలీసులు… దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చే వేటగాడి పెళ్ళాం

OTT Movie : ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్లకు వెళ్ళడం కంటే ఓటీటీలో సినిమాలను  చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిలో మలయాళ సినిమాలను మాత్రం మిస్ కాకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీ స్టోరీ చివరివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వేటగాడిని అనిపించుకోవడానికి ఓ వ్యక్తి చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ మలయాళ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

పప్పచ్చన్ (సైజు కురుప్) అనే వ్యక్తి తన తండ్రి మీషా మాతచ్చన్ (విజయరాఘవన్) లా గ్రామంలో పేరు సంపాదించాలని అనుకుంటూ ఉంటాడు. ఇతని తండ్రి ఒకప్పుడు మంచి వేటగాడుగా గుర్తింపు తెచ్చుకుని ఉంటాడు. ఇప్పుడు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు పప్పచ్చన్. అయితే పప్పచ్చన్ తన తండ్రి లాంటి ధైర్యవంతుడు కాదు. గ్రామస్తుల నుండి గౌరవం పొందడానికి తరచూ గొప్పలు చెప్పుకుంటాడు. అతని ఈ అలవాటు వల్ల గ్రామస్తులు అతని మాటలను పెద్దగా పట్టించుకోరు. అతని ప్రయత్నాలు కూడా తరచూ బెడిసికొడుతుంటాయి. ప్రస్తుతం ఒక ట్రక్ డ్రైవర్ గా మాత్రమే పని చేస్తుంటాడు. అయితే స్టోరీ ఇప్పుడు ఒక మలుపు తిరుగుతుంది. ఒక అడవి జంతువుని వేటాడిన సంఘటనలో పప్పచ్చన్ ఇరుక్కుంటాడు.


అతను తన షూటింగ్ నైపుణ్యాల గురించి గొప్పలు చెప్పడం వల్ల అతను అటవీ శాఖ అధికారుల దృష్టిలో పడతాడు. దీని ఫలితంగా అతను అడవి జంతువును వేటాడినట్లు ఆరోపణను ఎదుర్కొంటాడు. ఈ ఆరోపణల వల్ల పప్పచ్చన్ ఒళివిల అనే ప్రాంతంలోకి పరారీ అవుతాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని ఒక రోలర్ కోస్టర్‌గా మారుస్తుంది. ఇతని భార్య రీనా పప్పచ్చన్ ను ఇందులో నుంచి బయటపడేయటానికి ఒక ప్లాన్ వేస్తుంది. చివరికి పప్పచ్చన్ ఈ ఆరోపణల నుంచి బయట పడతాడా ? అతడు నిజంగానే అడవి జంతువుని వేటాడినాడా ? భార్య వేసిన ప్లాన్ ఏంటి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : మనుషుల రక్తం తాగే వాంపైర్ దెయ్యం … గుండెల్లో గుబులు పుట్టించే సీన్స్… తెలుగులోనూ స్ట్రీమింగ్

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘పప్పచన్ ఒలివిలను’ (Pappachan Olivilanu). 2023 లో వచ్చిన ఈ సినిమాకి సింటో సన్నీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సైజు కురుప్ ప్రధాన పాత్రలో నటించగా, శ్రింద, అజు వర్గీస్, విజయరాఘవన్, జగదీష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ మమ్మలకున్ను అనే కొండ ప్రాంత గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ పప్పచ్చన్ అనే ట్రక్ డ్రైవర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : చిన్నపిల్లను ఎత్తుకెళ్లే మిస్టీరియస్ జీవి… ఏలియన్, దెయ్యాలు, మంతగత్తెలు అన్నీ ఈ ఒక్క సిరీస్ లోనే

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 852 కోట్ల బ్లాక్ బస్టర్… నార్త్ ఆడియన్స్ కే ఎందుకు అందుబాటులో లేదంటే ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్…. ఓటీటీలో తుక్కురేగ్గొడుతున్న ధనుష్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : లేడీ సూపర్ హీరోకు ఓటీటీ చిక్కులు… హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టిన ‘లోకా చాప్టర్ 1’

OTT Movie : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

Big Stories

×