BigTV English

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు

Murder case on Ex PM Sheikh Hasina(Latest world news): బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో నిరసనకారులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించగా వారికి అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు.


జులై19 వ తేదీన ఢాకాలోని మహ్మద్‌పూర్ ప్రాంతంలో అల్లర్లను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్థానికంగా ఉన్న ఓ కిరాణం యజమాని అబూ సయూద్ మరణించాడు. అయితే ఈ కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను నిందితురాలిగా చేర్చారు. అంతే కాకుండా షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

రిజర్వేషన్ల అంశంపై మొదలైన అల్లర్లు బంగ్లాదేశ్‌ను కుంపటిగా మార్చాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు వివిధ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 500 కు పైగానే ఉంది. ఈ క్రమంలో జులై 19న మొహ్మద్‌పూర్‌లో జరిగిన అల్లర్లలో ఓ కిరాణా దుకాణం యజమాని మరణించాడు. అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణమని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆమెతో పాటు మరో ఆరుగురిపై కూడా కేసు నమోదైంది. నిందితుల్లో అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్యాడర్ మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ సహా మరికొందరి పేర్లు కూడా ఉన్నాయి.రిజర్వేషన్లు రద్దు చేసి ప్రతిభకు పట్టం కట్టాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల బంగ్లాదేశ్ కూడా అగ్ని గుండంలా తయారైంది. దీంతో అవామీ లీగ్ నేతృత్వంలో ప్రభుత్వం కూలిపోయింది. అల్లర్ల నేపథ్యంలో హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడారు.

Also Read: హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చిన ద్వీపం.. బంగ్లాపై అమెరికా కుట్ర నిజమేనా?

ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బంగ్లా సైన్యం సాయంతో తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏర్పడింది. హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాత్రానా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినవని బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని నోబెల్ గ్రహీత అహ్మద్ తెలిపారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×