BigTV English

Tollywood : థియేటర్లు మాయం అయ్యే రోజు వచ్చేసిందా… తప్పు ఎక్కడంటే..?

Tollywood : థియేటర్లు మాయం అయ్యే రోజు వచ్చేసిందా… తప్పు ఎక్కడంటే..?

Tollywood : ఒక్క సినిమా ఇండస్ట్రీ బాగుపడింది అంటే.. లక్షలాదిమంది కార్మికులు తమ జీవనాన్ని సంతోషంగా కొనసాగిస్తారు. అదే సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది అంటే కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో నాడు 2020 లో వచ్చిన కరోనా మహమ్మారి అందరికీ ఒక ఉదాహరణగా నిలిచింది. అందుకే ఉన్నంతలోనే సర్దుకొని బ్రతకాలని ఎంతోమంది నేర్చుకున్నారు కూడా.. కానీ మరి కొంతమంది మాత్రం సామాన్యుల నుండే డబ్బులు లాగే ప్రయత్నం చేయగా.. సామాన్యుడు కొట్టిన దెబ్బకు ఇప్పుడు సినిమా పరిశ్రమ విలవిలలాడుతోంది. ఇకపోతే థియేటర్ కి వెళ్తే టికెట్ ధరలు మాత్రమే కాదు థియేటర్ కి వెళ్లిన తర్వాత అక్కడ లభించే పాప్ కార్న్ మొదలు ఇతర స్నాక్స్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్తే కనీసం రూ.2000 ఖర్చు అవుతుంది.. అసలే చాలీచాలని జీతంతో.. వారానికి లేదా నెలకు ఒకసారి సినిమా చూడాలంటే.. ఇంత ఖర్చు అయితే.. భరించలేక అదే సామాన్యుడు వినోదాన్ని పొందడానికి మరో మార్గం వెతుక్కుంటున్నారు.


థియేటర్ వద్దు ఓటీటీ ముద్దు..

అదే ఓటీటీ ప్లాట్ ఫామ్.. కరోనా సమయంలోనే సినిమా ఇండస్ట్రీని ఈ ఓటీటీ కొంతవరకు ఆదుకుంది కానీ కార్మికులు మాత్రం ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఇక థియేటర్ లు అయితే దాదాపు మూతపడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి థియేటర్లు కళకళలాడుతున్నాయి అనుకునే లోపే.. టికెట్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు కథ, కంటెంట్ బాగుంటేనే థియేటర్ కి వస్తున్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ తో సంబంధం లేకుండా కథకు మాత్రమే వ్యాల్యూ ఇస్తున్నారు ఆడియన్స్.


థియేటర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారిన పైరసీ..

మరోవైపు పైరసీ.. సినిమాను ఎంతో కష్టపడి దర్శక నిర్మాతలు తెరకెక్కించిన తర్వాత.. థియేటర్లలోకి వచ్చిన గంటకే అనధికారిక వెబ్సైట్లో విడుదల అవ్వడం కూడా థియేటర్లకు మైనస్ గా మారింది.

థియేటర్లను వదులుకుంటున్న యాజమాన్యం..

దీంతో సినిమా పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది. చాలా చోట్ల థియేటర్లను లీస్ కి తీసుకున్న ఓనర్లు కూడా.. సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడంతో అద్దెలు కట్టలేక థియేటర్లను వదులుకుంటున్నారు. అంతేకాదు రెంట్లు కట్టలేక క్యాంటీన్ వదిలేస్తున్న పరిస్థితులు కూడా వచ్చేస్తున్నాయి. ఇక కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా స్టాప్ ను తగ్గించే విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా.. ఇక ఇదే జరిగితే మరికొన్ని రోజుల్లో మా ఊర్లో ఒక థియేటర్ ఉండేదట అని నెక్స్ట్ జనరేషన్ వారు చెప్పుకునే పరిస్థితులు వస్తాయి ఏమో అనిపిస్తోంది అంటూ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు

తప్పు ఎక్కడ జరుగుతోంది?

అయితే థియేటర్ పరిస్థితి ఇలా మారడానికి గల కారణం ఏంటి? తప్పు ఎక్కడ జరుగుతోంది ? అనే విషయాలను పరిశీలించినట్లయితే.. ప్రేక్షకుడి అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రెండుకు తగ్గట్టుగా కంటెంట్ ఉండాలని ఆలోచిస్తున్నారు. రొమాంటిక్ , లవ్, ఫ్యామిలీ, క్రైమ్, యాక్షన్, హార్రర్ లాంటి చిత్రాలను చూసి చూసి ఆడియన్స్ విసిగెత్తిపోయారు. ఈ క్రమంలోని ఏదైనా కొత్తగా కావాలని కోరుకుంటున్నారు. అటు దర్శక నిర్మాతలు కూడా ప్రేక్షకుడి అభిరుచులను దృష్టిలో పెట్టుకొని థియేటర్ కి రప్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు కూడా సరికొత్త స్ట్రాటజీలు ఉపయోగించి , ఆడియన్స్ ను థియేటర్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజలు పిచ్చివాళ్లు కాదు కదా.. ఎన్ని స్ట్రాటజీలు చేసినా వారు సినిమా నచ్చితేనే థియేటర్ కి వస్తున్నారు. మరి వారికి సినిమా నచ్చాలి అంటే వారి అభిరుచికి తగ్గట్టుగా సినిమా చేయాలి. పైగా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. అటు సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదు. ఇటు టికెట్ కొన్న ఆడియన్స్ కూడా నిరాశ పడకూడదు..అప్పుడే అటు సినిమా ఇండస్ట్రీ ఇటు థియేటర్ యాజమాన్యం రెండూ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతాయి.

దర్శక నిర్మాతలు ఆలోచించాల్సిందేనా..?

మంచి కంటెంట్ రావడం లేదు…
స్టోరీ లు రాయడంలో రైటర్స్, డైరెక్టర్స్ వెనకబడుతున్నారు.
త్రివిక్రమ్, ఎస్. శంకర్ లాంటి దిగ్గజ డైరెక్టర్లు కూడా నేటి ఆడియన్స్ పల్స్ ను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు.
అందుకే రెమ్యునరేషన్స్ పై ఉన్న ఫోకస్ యాక్టింగ్ పై పెడితే పరిస్థితి వేరేలా ఉండేది.

Samantha:సమంత నిర్మాతగా చేస్తున్న మూవీ… రిలీజ్ డేట్ ఫిక్స్..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×