BigTV English
Advertisement

Tollywood : దసరా సినిమాల జాతర… ఈ వారం థియేటర్లలో, ఓటిటిల్లో రాబోతున్న మూవీస్ ఇవే

Tollywood : దసరా సినిమాల జాతర… ఈ వారం థియేటర్లలో, ఓటిటిల్లో రాబోతున్న మూవీస్ ఇవే

Tollywood : ఈసారి దసరాకు థియేటర్లలో సినిమాల జాతర ఉండబోతోంది. సాధారణంగా సంక్రాంతికి థియేటర్లలో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు అందరూ సంక్రాంతి పండుగనే టార్గెట్ చేస్తారు. అయితే ఈసారి దసరాకు కూడా భారీ సంఖ్యలో సినిమాలో రిలీజ్ కాబోతున్నాయి. కానీ అందులో పెద్ద హీరోల సినిమాలేమీ లేకపోవడం విశేషం. ఈ ఏడాది దసరా సందర్భంగా వీకెండ్ కూడా కలిసి రావడంతో మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో కొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలు అయితే, మరికొన్ని కన్నడ, హిందీ, తమిళ భాషల సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందాం పదండి.


వేట్టయన్

తలైవా రజినీకాంత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వేట్టయన్ : ది హంటర్’. జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత ‘లాల్ సలామ్’ మూవీతో డిజాస్టర్ అందుకున్న రజిని ‘వేట్టయన్’ సినిమాతో మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నారు. అక్టోబర్ 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


విశ్వం

ఇక తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మాచో  స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘విశ్వం’ గురించి. శ్రీను వైట్ల దర్శకత్వంలో దాదాపు ఆరేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాలో తన మార్క్ కామెడీ, యాక్షన్ ఉంటుందని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. అక్టోబర్ 11న శుక్రవారం ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతోంది.

మా నాన్న సూపర్ హీరో

సుధీర్ బాబు హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’. గతేడాది ‘హంట్’, ఈ ఏడాది ‘హారొం హర’ సినిమాలతో వరస డిజాస్టర్లు అందుకున్న సుదీర్ బాబు ఆశలన్నీ ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది.

జనక అయితే గనక

సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ మూవీ దసరా రోజే రిలీజ్ కాబోతోంది. నిజానికి గత నెలలోనే థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు అక్టోబర్ 12న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మార్టిన్

కన్నడ స్టార్ ధృవ్ సర్జా హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘మార్టిన్’ అక్టోబర్ 11న తెరపైకి రాబోతోంది.

జిగ్రా

బాలీవుడ్ బడా హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రను పోషించిన ‘జిగ్రా’ అనే సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. తన తమ్ముడిని కాపాడేందుకు ఒక అక్క చేసే ప్రయత్నంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.

శ్రీశ్రీశ్రీ రాజావారు

నార్నె నితిన్ హీరోగా నటించిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా  ‘వేట్టయన్’ తో పోటీ పడబోతోంది.

ఓటీటీలో రానున్న తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఈటీవి విన్ లో అక్టోబర్ 10 న పైలమ్ పిలగా, తత్వ స్ట్రీమింగ్ కానున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×