BigTV English

Bhatti Vikramarka: 2014 నుంచి చెరువులను ఇలా కబ్జా చేశారు.. కళ్లకు కట్టినట్లు చూపించిన భట్టి, ఇవిగో ఆధారాలు!

Bhatti Vikramarka: 2014 నుంచి చెరువులను ఇలా కబ్జా చేశారు.. కళ్లకు కట్టినట్లు చూపించిన భట్టి, ఇవిగో ఆధారాలు!

Deputy CM Bhatti Vikramarka on Hydra: హైడ్రా, మూసీ రివర్ అభివృద్ధిపై ప్రతిపక్షాల వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘హైడ్రా పేరుతో విపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్. కానీ, ఇప్పుడు అవేమీ కనిపించడంలేదు. మాది ప్రజా ప్రభుత్వం. ప్రజా ఎజెండానే కానీ, వ్యక్తిగత ఎజెండా మాకు లేదు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. చెరువుల ఆక్రమణ హైదరాబాద్ కు పెను ప్రమాదంగా మారనున్నది. హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. ఈ నగరాన్ని భవిష్యత్ తరానికి అందించాలి. మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికి వ్యక్తిగత ఎజెండాలు లేవు. హైదరాబాద్ లో 20 పార్కులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. నగరంలో 2014కు ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నదానిపై వివరాలు సేకరించాం.


Also Read: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..

నగర వాసులకు మంచినీటి వనరులు ఉండే విధంగా నిర్మాణమైన లేక్స్ కనుమరుగు కావడం వల్ల భారీ వర్షాల వల్ల వచ్చే వరదలతో హైదరాబాద్ నగరానికి ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని, మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పిన గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి. భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ నగరాన్ని అందించాలన్న సంకల్పంతో చెరువుల సంరక్షణకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్ నగరానికి మణిహారంగా మూసీ నదిని తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ ఎజెండా తప్ప మాకు ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేనే లేదు.


చెరువులు అనేటివి సమాజానికి సంబంధించిన ఆస్తులు. వీటిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇష్టానుసారంగా చెరువులను కబ్జా చేశారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. వీటిని హైడ్రా కూల్చివేస్తుంది. అంతేకానీ, పేదల ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. ఈ విషయం తెలుసుకోకుండా విపక్షాలు హైడ్రాపై రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మంచి చేయాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేస్తే ఇలా మాట్లాడాతారా? మంచిపనులకు సహకరించాల్సిందిపోయి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు.

నగరంలో ఉన్న చెరువులు 2014లో ఎలా ఉన్నాయి.. ప్రస్తుతం ఎలా కబ్జాకు గురయ్యాయనే వివరాలను సేకరించాం. ఈ వివరాలను ప్రజల ముందు ఉంచుంతాం. ఈ వివరాలను జాగ్రత్తగా ఉంచుతాం. మన రాష్ట్రాన్ని, నగరాన్ని సుందీరకరణ చేద్దామన్న ఉద్దేశంతోనే హైడ్రాను, మూసీ అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పుడు చెరువుల ఆక్రమణ ఆపకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఈ పనులు చేపట్టింది.. కేవలం మాకోసమో.. సీఎం రేవంత్ రెడ్డి కోసమో.. కాదు.. నగరం బాగుండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపట్టాం. కానీ, ఇష్టానుసారంగా ప్రతిపక్షాలు మాట్లాడొద్దు. చెరువుల ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తున్న ప్రభుత్వానికి సహకరించకుండా అడ్డుకుంటారా?

Also Read: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..

అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి నగరాలను ఒకసారి మనం చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. వారు చెరువులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అనేది స్పష్టంగా తెలుస్తుంది. లండన్ లోనే ఉన్న చెరువులు, నాలాలు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం చెడగొట్టకుండా అక్కడి ప్రభుత్వాలు నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. కానీ, మన హైదరాబాద్ లో అటువంటి పరిస్థితి లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే నగరానికి ముప్పు తప్పదు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×