Minister Lokesh Comments on Jagan: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అనవసరంగా దుష్ర్పచారం బంద్ చేయాలంటూ సలహా ఇచ్చారు. ఈ మేరకు లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మంత్రి లోకేశ్ తాజాగా వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా మంత్రి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టిన పలు పోస్టులపై ఆయన స్పందించారు. వాటిపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అందులో లోకేశ్ ఈ విధంగా పేర్కొన్నారు.
Also Read: డిసెంబర్‌లో తిరుపతి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తెలుసా..??
‘విజయవాడలోని మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఫేక్ జగన్… ఇక నువ్వు మారవు.. ఇటు నీ ఫేక్ మూకలు కూడా అస్సలు మారరు. ఇంకెన్ని రోజులు ఈ ఫేక్ ప్రచారాలు చేస్తారు? ఈ ఫేక్ ప్రచారాలు చేసినందుకే కదా ప్రజలు మిమ్మల్ని ఘోరంగా ఓడించారు. ఫేక్ చేసీచేసి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. పాఠం నేర్చుకోకుండా మళ్లీ తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు మీరు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిగినట్లు దుష్ర్పచారం ఎందుకు చేస్తున్నావు? తిరుమల శ్రీవారితో పెట్టుకుంటున్నావ్ జాగ్రత్త. ఆయన ముందే మహిళ గల్ల దేవుడు. ఆ ఏడు కొండలపై నీ విష రాజకీయాలు చేయడం మానుకో. లేకపోతే నీకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకు రాదు’ అంటూ లోకేశ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. ప్రతి ఇంటికీ రూ. 25 వేల ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం