Tollywood Hero : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు రీసెంట్ టైమ్స్ లో తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పారు.ముఖ్యంగా కరోనా టైంలో చాలామంది యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. భారీగా కాకుండా అతి కొద్ది మంది మధ్యలో ఏడు అడుగులు వేసి ఒక ఇంటి వాళ్ళు అయిపోయారు. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళికి రెడీగా ఉన్న చాలామంది హీరోలు కూడా ఉన్నారు. కరోనా టైం లో పెళ్లిళ్లు చేసుకున్న వారిలో రానా, నితిన్, నిఖిల్ వంటి హీరోలు ఉన్నారు. రీసెంట్ గా శర్వానంద్ కూడా పెళ్లి చేసుకొని తండ్రి అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక నారా రోహిత్ కూడా త్వరలో ఒక ఇంటివాడు అవ్వనున్నాడు. నారా రోహిత్ కి పెళ్లి కాలేదు అనే విషయం చాలామందికి ఇప్పటివరకు తెలియదనే చెప్పాలి. ఇక నారా రోహిత్ రేపు శ్రీ లెల్ల తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ప్రతినిధి సినిమాలో ఈ శ్రీ లెల్ల హీరోయిన్ గా నటించింది.
తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో
రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో తండ్రి కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుని ఇప్పటివరకు పిల్లలు లేని వ్యక్తులంటే ఇద్దరు హీరోలు ఉన్నారు. వారిలో ఒకరికి వివాహం జరిగి దగ్గర దగ్గర ఐదేళ్లు అవుతుంది. అప్పట్లో ఒక హీరో మాట్లాడుతూ “తను నాకు చాలా కాలంగా తెలుసు. ఆమె మా బంధువుల క్లాస్‌మేట్ మరియు ఆమె మంచి స్నేహితురాలు. నాకు ఆమె అలాగే తెలుసు. ఆమె ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరగా ఉంది. వివాహం విషయానికి వస్తే, ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఆలోచిస్తారు మరియు చాలా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఒకరి హృదయంలోకి ప్రవేశించినప్పుడు, ఆ లెక్కలన్నీ తొలగిపోతాయి. నేను ఆమెను ప్రేమించడం ప్రారంభించిన తర్వాత నాకు కూడా అలాగే అనిపిస్తుంది” అని లక్ష్మీ మంచుతో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో వెల్లడించారు.
మరో యంగ్ హీరో
యాంగ్ హీరో 2021 లో పెళ్లి చేసుకున్నాడు. తన కాలేజీ ఫ్రెండ్ అయినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ నేను హీరో అయిన తర్వాత వచ్చి మీ నాన్నని అడుగుతాను అంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు. అలానే హీరో అయిన తర్వాత వాళ్ళ నాన్నను ఒప్పించి ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు యంగ్ హీరో పిల్లలను కనలేదు. అయితే మొత్తానికి వీరిద్దరిలో ఎవరో ఒకరు తండ్రి కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : 8 Years Fo Bahubali 2 : ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించి నేటికీ ఎనిమిదేళ్లు