BigTV English
Advertisement

Pokiri 19 years : పూరి సృష్టించిన పెను సంచలనం అది.. ఆ రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా..?

Pokiri 19 years : పూరి సృష్టించిన పెను సంచలనం అది.. ఆ రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా..?

Pokiri 19 years : డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన సినిమా పోకిరి.. ఈ సినిమా 2006 ఏప్రిల్ 28వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది.. దర్శకుడు పూరి జగన్నాథ్ కు మంచి గుర్తింపు తెచ్చిన మూవీ.. ఈ సినిమా విడుదలై ఈరోజుకు 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. పోకిరి సినిమా అప్పట్లో సృష్టించిన కలెక్షన్స్, రికార్డులని ఒకసారి గుర్తు చేసుకుందాం..


అద్భుతమైన రికార్డు..

పోకిరి కథ హైదరాబాద్ అండర్ వరల్డ్ లో జరిగే ఒక గూండ పండు చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రకు ఒక రహస్య ఒప్పందం ఉంటుంది. అది సినిమాను ఉత్కంఠభరితంగా మలుస్తుంది. పూరి జగన్నాథ్ యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్ అద్భుతంగా ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమాలో పండుగాడు గా మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, మంజుల ఘట్టమనేని ఈ సినిమాని నిర్మించారు. అప్పట్లో పోకిరి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. ఈ చిత్రం 100 రోజులకు పైగా 200 సెంటర్లలో ఆడింది. అప్పట్లో ఇలా వంద రోజులు ఆడడం ఒక సెన్సేషన్.. ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, బెంగాలీ, రీమేక్ చేశారు. పోకిరిని హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేయగా, సల్మాన్ ఖాన్ నటించారు. అక్కడ కూడా భారీగా విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ లవ్ జానర్ లో వచ్చిన పోకిరి తెలుగు సినిమాలలో పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ తో ఆయన స్టైల్, మార్క్ తో సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. అప్పట్లో ఈ సినిమా దాదాపు 40 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇది ఒక అద్భుతమైన రికార్డు. ఈ సినిమాకి ఐదు నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డులు లభించాయి.


ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్..

మహేష్ బాబు పోకిరి సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటివరకు ఫ్యామిలీ హీరోగా ఉన్నా మహేష్ బాబును ఒక కొత్త కోణంలో పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటన, ఇలియానా గ్లామర్, బ్రహ్మానందం కామెడీ యాక్షన్ సీక్వెన్స్, మహేష్ బాబు అండర్ కవర్గా పనిచేయడం పోలీస్ అని రివిల్ అయినప్పుడు వచ్చే సీన్స్ అన్ని అప్పట్లో అభిమానులతో విజిల్స్ వేయించాయి. ఈ సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసిన ఘనత పూరి జగన్నాథ్ కే దక్కుతుందని చెప్పాలి.

మణిశర్మ మ్యాజిక్ ..

పోకిరి సినిమాకు సంగీతం మణిశర్మ అందించారు. ఈ సినిమాలో విజయంలో ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు. దేవుడా దేవుడా సాంగ్, డోలే డోలే సాంగ్, గల గల పారుతున్న గోదారిలా వంటి సాంగ్స్ ఇప్పటికీ ఓ ఐకానిక్ నెంబర్ సాంగ్స్ గా నిలిచాయి. ఇక మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 19 సంవత్సరాల తరువాత ఇప్పటికి పోకిరి సినిమా టీవీలలో వస్తే అభిమానులు చూస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు.. ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో, ఈ సినిమా ఎన్నోసార్లు రీ రిలీజ్ చేసి అత్యధిక వసూళ్లను సాధించిందో మనకి తెలిసిందే. ఇక పోకిరి సినిమా కేవలం ఒక సినిమాలానే కాక తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో శాశ్వతమైన ముద్ర వేసినా మహేష్ బాబు సినిమాగా గుర్తుండిపోతుంది. మహేష్ బాబు కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగు మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుంటుంది.

Retro: రెట్రో సునామీ మొదలైంది.. విడుదల ముందే రికార్డులు.. సూర్య విశ్వరూపం..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×