Toxic Movie: ఈరోజుల్లో ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం పెద్ద విషయం కాదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇప్పటికే ఇండియన్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయి వచ్చేసిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు సైతం ఇంగ్లీష్ భాషలో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే అదే బాటలో మరిన్ని సినిమాలు కూడా ఇంగ్లీష్‌లో విడుదల కావాలని సన్నాహాలు చేస్తున్నాయి. రాకింగ్ స్టార్ యశ్ అప్‌కమింగ్ మూవీ ‘టాక్సిక్’ కూడా అదే ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
క్రేజీ రూమర్
‘కేజీఎఫ్’ సినిమాల తర్వాత యశ్ (Yash)కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ లభించింది. తన తర్వాతి సినిమాతో కూడా ఆ పాపులారిటీ, క్రేజ్ అలాగే కాపాడుకోవాలని యశ్ తెగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ‘కేజీఎఫ్ 2’ విడుదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతున్నా ఇంకా ఈ హీరో నుండి మరొక చిత్రం రాలేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అయినా ఫ్యాన్స్ అంచనాలను అందుకోవాలని ‘టాక్సిక్’కు సంబంధించిన ప్రతీ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇటీవల పలు హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లతో యశ్ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఆ విషయంపైనే మరొక రూమర్ తాజాగా బయటికొచ్చింది.
చర్చలు సాగుతున్నాయి
‘టాక్సిక్’ సినిమా కన్నడతో పాటు పలు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ఇంగ్లీష్‌లో కూడా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్‌లో కూడా ఈ సినిమా విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని ప్రేక్షకులు చూడగలుగుతారు. ఇప్పటికీ ఈ విషయంపై పలువురు ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపిస్తూనే ఉన్నారట మేకర్స్. ‘టాక్సిక్’ (Toxic)తో యశ్ ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్‌పై కన్నేశాడని ఈ ప్లానింగ్ చూస్తుంటే అర్థమవుతోంది. గీతూ మోహన్ దాస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నా నిర్మాణ బాధ్యతల్లో యశ్ కూడా భాగమయ్యాడు. అందుకే ఈ సినిమాను ఎలా ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్లాలా అని తెగ తపనపడుతున్నాడు.
Also Read: అలా చేస్తే అందరి ముందు కొట్టేదాన్ని.. అతడికి రియా చక్రవర్తి స్ట్రాంగ్ వార్నింగ్
ఇద్దరు హీరోయిన్లు
కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు చెందిన వెంకట్ కే నారాయణ్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌కు చెందిన యశ్ ఇద్దరూ కలిసే ‘టాక్సిక్’ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుండేలా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో యశ్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ప్రస్తుతం యశ్, కియారా మధ్య డ్యూయెట్ సాంగ్ షూటింగ్ కోసం మేకర్స్ అంతా ఫారిన్‌కు వెళ్లారు. కియారా అద్వానీతో పాటు సీనియర్ హీరోయిన్ నయనతార (Nayanthara) కూడా ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. చాలావరకు అన్ని భాషల నుండి నటీనటులను తీసుకొచ్చి ‘టాక్సిక్’లో భాగం చేయాలనుకుంటున్నారు మేకర్స్. అలా అయితే ప్రతీ భాషలో మూవీకి హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.